Saturn Transit Effect: మకరరాశిలో శని సంచారం.. ఈ 6 రాశులవారికి డబ్బే డబ్బు..!

Saturn Transit 2022:  శని దేవుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 12న శని మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం కారణంగా ఆరు రాశులవారు లాభాలు పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2022, 11:46 AM IST
  • మకరరాశిలో శని సంచారం
  • ఆరు రాశులవారికి ప్రయోజనం
Saturn Transit Effect: మకరరాశిలో శని సంచారం.. ఈ 6 రాశులవారికి డబ్బే డబ్బు..!

Shani Gochar 2022:  కర్మ ప్రకారం ఫలితాలను ఇచ్చే శని రాశిలో మార్పు జరగనుంది. జూలై 12వ తేదీ ఉదయం 10.27 గంటలకు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శని.. మకరరాశిలోకి ప్రవేశించనుంది. అక్కడే ఆరు నెలలపాటు అంటే  2023 జనవరి 23 వరకు ఉండనుంది. శని మకరరాశిలో ప్రవేశించడం (Saturn Transit in Capricron 2022) వల్ల ఏయే రాశుల వారికి మేలు జరగనుందో ఇప్పుడు చూద్దాం.  

మేషం (Aries): ఈ రాశి వారికి శని సంచారం విజయాన్ని ఇస్తుంది. కానీ వారు కష్టపడి పని చేయవలసి ఉంటుంది. వీరు కొత్త కారు లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. 

వృషభం (Taurus): శని రాశి మార్పు వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. వచ్చే 6 నెలల వరకు లాభం ఉంటుంది, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పని ప్రశంసించబడుతుంది. 

కన్య (Virgo): శనిదేవుని అనుగ్రహంతో ఈ రాశికి వారికి పిల్లలు పుడతారు. అంతేకాకుండా ఆనందకరమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. 

వృశ్చికం (Scorpio): శని సంచారం ఇనుము, నూనె, యంత్రం లేదా గని వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు భారీ లాభాలను ఇస్తుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు, ప్రయాణాలు లాభిస్తాయి. 

మకరం (Capricron) : శని రాశి మార్పు వల్ల మకరరాశి వారికి ప్రతిష్ట పెరుగుతుంది. శక్తి, ధైర్యం పెరుగుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

మీనం (Pisces): శని సంచారం పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందజేస్తుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. యంత్రం లేదా చమురు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు.

Also Read: Yogini Ekadashi 2022: యోగినీ ఏకాదశి రోజున ఈ సింపుల్ పరిహారాలు చేయండి.. అపారమైన సంపదను పొందండి! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News