Chandra Babu on CM Jagan: ఏపీలో పాలిటిక్స్ రంజు మీద ఉన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత అంశం మరింత నిప్పు రాజేసింది. దీనిపై ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలోనే ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది.
ఈక్రమంలోనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. మరికొంత మంది నేతలను గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాత్రి పూట కూల్చి వేతల అంశంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవన్నారు.
అయ్యన్న పాత్రుది కబ్జా కాదని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇడుపుల పాయలో 600 ఎకరాల దళితుల భూములను లాక్కుకున్న విషయం మర్చిపోయారా అని మండిపడ్డారు. టీడీపీ నేతల ముందుస్తు అరెస్ట్‌లు జగన్ పిరికితనానికి నిదర్శమన్నారు. ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీ బీసీ నేతలను టార్గెట్ చేయడం ఏంటని అన్నారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లు, ఇళ్లపై దాడులతో బీసీ నేతలను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. అయ్యన్న ఇంటిపై దాడి పతనమవుతున్న జగన్ ప్రభుత్వ ఆలోచనను బయట పెట్టిందన్నారు.
Also read:TS Inter Results 2022 : ఆ రోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. tsbie.cgg.gov.inలో వివరాలు..
Also read:Basara IIIT: సీఎం నుంచి లేఖ వస్తేనే కదిలేది! బాసరలో ఏడవ రోజు అదే ఉద్రిక్తత.. కేసీఆర్ కు సంజయ్ లేఖ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook