Telangana Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర నడుస్తోంది. ప్రభుత్వం విడతలవారీగా ఆయా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన పోస్టులకు వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా మరో 931 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన ఈ పోస్టుల్లో 704 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులు, 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులు ఉన్నాయి.
అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో మెకానికల్ 84, సివిల్ 320, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ 100, ఎలక్ట్రికల్ పోస్టులు 200 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు డిప్లోమా, ఏఈఈ పోస్టులకు బీటెక్ విద్యార్హత కలిగి ఉండాలి. ఏఈ పోస్టుల్లో మల్టీజోన్-1 (కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు)పరిధిలో 259 పోస్టులు, మల్టీజోన్-2 (యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు) పరిధిలో 445 పోస్టులు ఉన్నాయి.
ఏఈఈ పోస్టుల్లో 182 సివిల్ ఇంజనీర్ పోస్టులు కాగా, మరో 45 మెకానిల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో మల్టీజన్ 1 పరిదిలో 112, మల్టీజోన్ 2 పరిధిలో 115 పోస్టులు ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు రోజుల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన జీవో వెలువడే అకవాశం ఉంది.
కాగా, తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 91,142 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 11,103 ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నారు. మిగతా ఉద్యోగాలకు విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్ సహా పలు శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా నీటిపారుదల శాఖలో ఏఈ, ఏఈఈ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.
Also Read: Fathers Day 2022: ఇవాళ ఫాదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది, దీని ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook