IND vs SA 4th T20: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఓటమితో ఇక సిరీస్ చేజారుతుందేమోనన్న అనుమానాలు కలిగాయి. అయితే ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి సఫారీలపై వరుస విజయాలు నమోదు చేసింది. శుక్రవారం (జూన్ 17) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. టాప్-4 బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (4), ఇషాన్ కిషన్ (27), శ్రేయాస్ అయ్యర్ (4), రిషబ్ పంత్ (17) పరుగులు మాత్రమే చేశారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కేలా చేశారు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ 9 ఫోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది.సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా మహారాజ్, ప్రెటోరియస్, మార్కో జాన్సెన్, నోర్ట్జే తలో వికెట్ తీశారు.
టీమిండియా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. డస్సెన్ చేసిన 20 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోర్. ఇద్దరు బ్యాట్స్‌మెన్ డకౌట్ అవగా, మరో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చాహల్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిరీస్‌పై టీమిండియా ఆశలు సజీవంగా ఉన్నాయి. టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 ఆదివారం (జూన్ 19) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.
Also Read: Horoscope Today June 18th : నేటి రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారికి ఉద్యోగంలో బదిలీ తప్పకపోవచ్చు..
Also Read: Horoscope Today June 18th : నేటి రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారికి ఉద్యోగంలో బదిలీ తప్పకపోవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
IND vs SA 4th T20: నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం.. 82 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చిత్తు..
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్
నాలుగో టీ20లోనూ విజయం సాధించిన టీమిండియా
82 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘనవిజయం