Lassi Benefits: పాలకు సంబంధించిన అన్ని పదార్థలు మానవ శరీరానికి చాలా ప్రయెజనాలను చేకూరుస్తాయి. కావున ప్రస్తుతం పాల ఉత్పత్తులైన పెరుగు, పనీర్, నెయ్యి విక్రయాలు పెరిగాయి. ముఖ్యంగా మార్కెట్‌లో పెరుగు డిమాండ్ చాలా పెరిగింది. భారతీయులు పెరుగును చాలా రకాలుగా వినియోగిస్తారు. దీనితో తయారు చేసిన మజ్జిగ, లస్సీని తాగడానికి అందరు ఇష్టపడతారు. అయితే ఈ లస్సీ ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఓ దివ్యౌషదంగా పని చేస్తుంది.
లస్సీలోని పోషకాలు:
లస్సీలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉంటాయి. దీంతో పాటు, లస్సీలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం , జింక్ కూడా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి లస్సీ యొక్క ప్రయోజనాలు
1. లస్సీ కాలేయానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
2. బరువు తగ్గడానికి లస్సీ సహాయపడుతుంది.
3. లస్సీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
4. లస్సీలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే లస్సీ తాగడం వల్ల తక్షణ శక్తి వస్తుంది.
5. లస్సీలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. బరువు తగ్గించడానికి లస్సీ సహాయపడుతుంది.
6. ప్రతిరోజూ లస్సీ తీసుకోవడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది.
7. క్రమం తప్పకుండా లస్సీని తాగితే.. పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Constipation: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా సులభంగా ఉపశమనం పొందండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Lassi Benefits: లస్సీ తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
లస్సీ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు
లస్సీ కాలేయానికి చాలా మేలు చేస్తుంది
లస్సీలోని చాలా రకాల పోషకాలు ఉంటాయి