అతనికి మలాలా ఎవరో తెలియదట..!

  

Last Updated : Oct 22, 2017, 05:54 PM IST
అతనికి మలాలా ఎవరో తెలియదట..!

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. ఎంతో శ్రమకోర్చి కష్టపడి చదివేతేనే అందులో సీటు వస్తుంది. అటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఫ్రెషర్స్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది.

ఇటీవలే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత  మలాలా యూసఫ్ జాయ్ కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరిన క్రమంలో, ఆమె ఎవరో తనకు తెలీదని, జేమ్స్ అనే విద్యార్థి గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఆ తర్వాత తానే మళ్లీ ఆమెవరో తెలుసుకోవడానికి గూగుల్ చేశానని చెప్పడం గమనార్హం.

ఆ వాట్సాప్ పోస్టుకు అదే గ్రూప్‌లో ఉన్న మలాలా ఒక స్మైలీని జవాబుగా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బాలికా విద్యా హక్కుల కోసం పోరాటం చేస్తున్న మలాలా ఇటీవలే ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్స్‌గా ఎంచుకున్నారు.

అయితే ఆ యూనివర్సిటీకి వెళ్లిన తొలిరోజే జీన్స్ ధరించడంపై పలువురు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఆమె ముస్లిం సంప్రదాయాలను బేఖాతరు చేస్తుందని సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేశారు. 

Trending News