కథువా, ఉన్నావ్ అత్యాచార బాధితులకు న్యాయం జరుగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో అనేకచోట్ల వేల మంది ఆందోళనకారులు తమ ఈ ఉదంతాలపై నిరసనలు తెలియజేస్తున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టుతున్నారు. వాళ్లూ వీళ్లూ అనికాకుండా అందరూ బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో ఈ ఘటనలపై స్పందిస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కథువా, ఉన్నావ్ ఘటనలపై స్పందించారు. 'కథువా, ఉన్నావ్ దుర్ఘటనలు మానవత్వానికే మాయనిమచ్చ. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలి. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి' అని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
కతువా, ఉన్నావ్ దుర్ఘటనలు మానవత్వానికే మాయనిమచ్చ. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలి. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.
— N Chandrababu Naidu (@ncbn) April 16, 2018