India Covid cases Updates: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 7,584 కొవిడ్ కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. ఈ మహమ్మారితో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 3,791 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా నమోదైంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతంగా నమోదైంది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన మెుత్తం కేసుల సంఖ్య 4,31,97,866కి చేరగా.. టోటల్ మరణాల సంఖ్య 4,31,97,866గా ఉంది. దేశవ్యాప్తంగా 36,267 యాక్టివ్ కేసుల (Active Cases in India) ఉన్నాయి. మరో 3,35,050 మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. గురువారం 15,31,510 మందికి టీకాలు వేశారు. మెుత్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,76,42,992 కి చేరింది.
#COVID19 | India reports 7,584 fresh cases, 3,791 recoveries, and 24 deaths in the last 24 hours.
Total active cases are 36,267 pic.twitter.com/kwQIIy8K3s
— ANI (@ANI) June 10, 2022
వరల్డ్ వైడ్ గా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 5,62,194 కేసులు వెలుగుచూశాయి. మరో 1,417 మంది వైరస్‌తో మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో 80,993 కొత్త కేసులు, 195 మరణాలు చోటుచేసుకున్నాయి. జర్మనీలో 75,494 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Covid-19 Fourth Wave: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?