/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో సూపర్ సండే మొదలైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తలపడ్డారు. హోరోహోరీగా సాగిన ఈ బాడ్మింటన్ ఫైనల్‌లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ గెలుపొందింది. ఉత్కంఠత రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో ఇరువురూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన సైనా.. రెండో సెట్‌లో కాస్త శ్రమించాల్సి వచ్చింది. చివరికి సైనా నెహ్వాల్ 21-18, 23-21 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2010 తరువాత సైనాకు ఇది రెండో కామన్వెల్త్ స్వర్ణం.

 

 

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటింది. మొత్తం 62 పతకాలతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 26 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 19 కాంస్య పతకాలతో మొత్తం 62 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. కాగా, కామన్వెల్త్ గేమ్స్ నేటితో ముగియనున్నాయి. షటిల్, బ్యాడ్మింటన్‌లో మరొకొన్ని పతకాలు భారత్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అలాగే పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ రజతం గెలుచుకున్నాడు.

Section: 
English Title: 
CWG 2018: Saina Nehwal Defeats P.V. Sindhu, Takes Gold Medal
News Source: 
Home Title: 

CWG 2018: ఫైనల్లో సింధుపై సైనా గెలుపు

CWG 2018: బాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
CWG 2018: బాడ్మింటన్ ఫైనల్లో సింధుపై సైనా గెలుపు