Bitter Gourd Benefits: కాకరకాయను వీరు అస్సలు తినకూడదు..తింటే దుష్ప్రభావాలు తప్పవు..!!

Bitter Gourd Benefits: జూన్‌ నెల వచ్చిందంటే వాతావారణంలో వేడి తారాస్థాయికి చేరుతుంది. మారుతున్న వాతావారణానికి అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు వస్తాయి. ఈ వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రెట్‌గా ఉంచడానికి పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయలను తినడానికి ఇష్టపడతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2022, 12:52 PM IST
  • కాకరకాయను పిల్లలకు తల్లిపాలు ఇచ్చే స్త్రీలు తినకూడదు.
  • గర్భధారణ సమయంలో కూడా కాకర తినకూడదు.
  • తినడం వల్ల కడుపులో తిమ్మిర్లు లేదా గ్యాస్ ఏర్పడవచ్చు.
Bitter Gourd Benefits: కాకరకాయను వీరు అస్సలు తినకూడదు..తింటే దుష్ప్రభావాలు తప్పవు..!!

Bitter Gourd Benefits: జూన్‌ నెల వచ్చిందంటే వాతావారణంలో వేడి తారాస్థాయికి చేరుతుంది. మారుతున్న వాతావారణానికి అనుగుణంగా ఆహారంలో కూడా మార్పులు వస్తాయి. ఈ వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రెట్‌గా ఉంచడానికి పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయలను తినడానికి ఇష్టపడతారు. అయితే అలాంటి కూరాగాయల్లో కాకరకాయ ఒకటి. ఇందులో చాలా రకాల పోషక విలువలు నిండి ఉంటాయి. కావున శరీరానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా వీటిని అధిక మొత్తంలో వినియోగించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ కాకర వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయి. అంతే కాకుండా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో కాకరకాయ ప్రయోజనాలు:

-కాకరకాయ తినడం వల్ల బరువు తగ్గుతారు.
-కంటి చూపు పెరగాలంటే వేసవిలో పచ్చికాకరను తింటే మంచిది.
-డయాబెటిక్ పేషెంట్లు వేసవిలో కాకరకాయ చెక్కర లెవల్స్‌ను నియంత్రిస్తుంది.
-కాకరకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా శరీరం వాపులు తగ్గిపోతాయి.
- చర్మానికి సంబంధించిన అనేక వ్యాధులను దూరం చేస్తుంది.
-మలబద్ధకం, పైల్స్ వంటి వ్యాధులకు ఔషదంగా పని చేస్తుంది.

కాకరకాయ దుష్ప్రభావాలు:

-డయాబెటిక్ పేషెంట్లు కాకరకాయ తినడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
-పిల్లలకు తల్లిపాలు ఇచ్చే స్త్రీలు తినకూడదు.
-గర్భధారణ సమయంలో కూడా కాకర తినకూడదు.
-కడుపులో తిమ్మిర్లు లేదా గ్యాస్ ఏర్పడవచ్చు.

కాకరకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది:

కాకరకాయ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే వేసవిలో కాకరకాయను ఎక్కువగా తింటారు. ఇందులో  కాల్షియం, ప్రొటీన్, పొటాషియం, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ లాంటి పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి సహాయపడతాయి.

Also Read: Jackfruit Disadvantages: పనసపండు తిన్న తర్వాత ఈ పండ్లను అస్సలు తినకూడదు..!!

Also Read: Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News