Puja Path Rules in Telugu: పూజలో అక్షత, చందనం, కుంకుమ, ఫల-పుష్పాలు, అగరుబత్తీలు, భోగ్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటిని సాధారణంగా పూజలు, శుభ కార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు పూజ చేసేటప్పుడు అగరబత్తీలు (incense sticks) వెలిగిస్తే..ఇక నుంచి అలా చేయడం మానేయండి. అగరబత్తీలు కాల్చడం వల్ల మీకు పితృదోషం చుట్టుకోవడంతోపాటు అనేక నష్టాలు కలుగుతాయి.
అగరుబత్తీలు వెలిగించడం అశుభం
వాస్తు శాస్త్రంలో వెదురు (Bamboo) చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో మరియు ఆఫీసులో ఈ మొక్కను కలిగి ఉండటం సానుకూల మరియు పురోగతిని తెస్తుంది. అనేక రకాల వాస్తు దోషాలను తొలగించడానికి వెదురు మొక్కను ఉంచడం మంచిది. అలాంటిది శుభకార్యాలు, పూజల పేరుతో వెదురును తగలబెట్టడం సరికాదు. భారతీయ సంప్రదాయం ప్రకారం, వెదురును కాల్చడం నిషిద్ధం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వెదురు చెక్కను అగరుబత్తీలు చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి, అగరబత్తులను కాల్చడం కూడా మంచిది కాదు.
>> వెదురు వంశానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అలాంటిది మీ స్వంత చేతులతో వెదురు కాల్చడం మీ కుటుంబ వంశానికి హాని కలిగించినట్లే.
>> హిందూమతంలో అంత్యక్రియలకు చితిని పేర్చేటప్పుడు వెదురును ఉపయోగిస్తారు. కానీ వెదురును అలా కాల్చడం మంచిది కాదు. దీని వల్ల మీకు పిత్రదోషం చుట్టుకుంటుంది.
>> వెదురును కాల్చడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది. అలాంటిది వెదురు చెక్కను ఉపయోగించి అనేక రసాయనాల పూసి చేసిన అగరబత్తీలను కాల్చడం మరింత ప్రమాదకరం.
>> గ్రంధాలలో కాల్చకూడదని నిషేధించిన ఆ వెదురు చెక్కను మనం ప్రతిరోజూ అగరబత్తుల పేరుతో కాల్చివేస్తున్నాం. ఇది మంచి పద్దతి కాదు.
>> ఫెంగ్ షుయ్ ప్రకారం, వెదురును కాల్చడం ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే వెదురు మొక్క అదృష్టాన్ని తెస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook