Green Tea: ఆధునిక జీవనశైలిలో గ్రీన్ టీ ప్రాముఖ్యత పెరుగుతోంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గ్రీన్ టీ పరిష్కారంగా నిలుస్తోంది. గ్రీన్ టీ ఎప్పుడు వాడుకలో వచ్చింది..గ్రీన్ టీతో కలిగే ఆరోగ్యపరమైన దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం..
గ్రీన్ టీ. చాలా ఆరోగ్య సమస్యలకు ఓ పరిష్కారం. బరువు తగ్గించుకునేందుకు ఎక్కువగా ఉపయోగించే సాధనం. అయితే గ్రీన్ టీతో దుష్పరిణామాలు కూడా ఉన్నాయని చాలా తక్కువమందికి తెలుసు. అవేంటో తెలుసుకుందాం..
గ్రీన్ టీతో దుష్పరిణామాలు
గ్రీన్ టీని ఎలా, ఎప్పుడు తాగకూడదనేది తెలుసుకుందాం. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. గ్రీన్ టీ ఎప్పుడూ పరిమితంగానే తీసుకోవాలి. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్, లివర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే..గర్భస్రావం కూడా జరిగే అవకాశాలున్నాయని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి పడుకునేముందు గ్రీన్ టీ తీసుకోకూడదు. మరోవైపు మద్యాహ్నం భోజనం తరువాత గ్రీన్ టీ సేవిస్తే భోజనం ద్వారా లభించే పోషక విలువలు తగ్గిపోతాయి. ఈ జాగ్రత్తలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గ్రీన్ టీ సేవిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గ్రీన్ టీ ఎప్పుడు, ఎవరు కనుగొన్నారు
గ్రీన్ టీను తొలిసారిగా కనిపెట్టింది జపాన్‌కు చెందిన మిచియో సుజిమొరా. జపాన్‌లో ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ కమ్ బయోకెమిస్ట్. గ్రీన్ టీలోను మూలకాల్ని ప్రపంచానికి తొలిసారిగా తెలియజేసింది ఈమెనే. 1888 సెప్టెంబర్ 17న జన్మించిన సుజిమొరా.. టోక్యో ఇంపీరియల్ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారు. ముందుగా గ్రీన్ టీలో విటమిన్ బి1 ఉందని గుర్తించారు. తరువాత విటమిన్ సి ఉందని తేల్చారు. 1929లో జరిపిన పరిశోదనల్లో ఫ్లవనాయిడ్ కాటెచిన్, 1930లో టానిన్‌ను గుర్తించారు. తరువాత అన్నీ కలిపి ఆన్ ద కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్రీన్ టీ థియరీ రూపొందించారు.
జపాన్ దేశంలో వ్యవసాయంలో డిగ్రీ పట్టా తీసుకున్న మొదటి మహిళ కూడా ఈమెనే. గ్రీన్ టీలో ఉండే ఎపిగాలోకేటెచిన్ 3 గ్యాలేట్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. మరోవైపు పోషకంలోని వాపు, మంటను తగ్గించే గుణం..మొటిమలు రాకుండా కూడా చేస్తుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ సేవనం ఓ మంచి డైట్‌గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు గ్రీన్ టీ మంచి ప్రత్యామ్నాయం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుంది.
Also read: Papaya Benefits: బొప్పాయి పండుతో శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook