Black Pepper With Ghee Benefits: నల్ల మిరియాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే గుణాలు శరీరానికి పోషకవిలువలను అందించేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా నల్ల మిరియాలలో నెయ్యిని కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి, మిరియాల మిశ్రమాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థను బల పరిచేందుకు కృషి చేస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు, మెదడుకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇవే కాకుండా శరీరానికి ఈ మిశ్రం చేసే ఇతర లాభాలను తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
నల్ల మిరియాలు, నెయ్యి కలయిక మిశ్రమాన్ని క్రమం తప్ప కుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కరోనాతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నల్ల మిరియాలు, నెయ్యి మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.
శరీరానికి చాలా ప్రయోజనాలు:
శరీరంలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్యాన్సర్, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలో బాధపడుతున్న వారు పసుపు, నెయ్యి, నల్ల మిరియాల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది:
నెయ్యి, నల్ల మిరియాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తింటే జ్ఞాపకశక్తి పెరుగడమే కాకుండా, శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.
కంటిచూపును పెంచుతుంది:
పచ్చి కూరగాయలు తినడం వల్ల కంటి చూపు పెరుగుతుందని చాలా మందికి తెలుసు. కానీ నెయ్యి, నల్ల మిరియాలు కూడా కంటి చూపును పెంచుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: Amla juice benefits: ఉసిరికాయ రసంతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook