Maggi Divorce Case: ప్రతిరోజూ మ్యాగీ పెడుతుందని.. భార్యకు విడాకులిచ్చిన భర్త! ట్విస్ట్ ఏంటంటే

Maggi Divorce Case: టిఫిన్‌, లంచ్, డిన్నర్ కూడా మ్యాగీనే పెడుతుండడంతో.. తినలేక విసిగిపోయిన భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 03:01 PM IST
  • ప్రతిరోజూ మ్యాగీ పెడుతుందని
  • భార్యకు విడాకులిచ్చిన భర్త
  • ట్విస్ట్ ఏంటంటే
Maggi Divorce Case: ప్రతిరోజూ మ్యాగీ పెడుతుందని.. భార్యకు విడాకులిచ్చిన భర్త! ట్విస్ట్ ఏంటంటే

Maggi Divorce Case: Husband divorces wife after she cooks Maggi for every day: భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. చిన్నచిన్న కారణాలకు ఎవరూ విడాకులు తీసుకోరు. భార్యభర్తలు అన్న తర్వాత సర్దుకుపోవాలి అనే భావనతో చిన్న కారణాలకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగరు. అయితే ఓ భర్త మాత్రం చాలా చిన్న కారణానికే భార్యకు విడాకులు ఇచ్చాడు. టిఫిన్‌, లంచ్, డిన్నర్ కూడా మ్యాగీనే పెడుతుండడంతో.. తినలేక విసిగిపోయిన ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

కర్ణాటక మైసూరులోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎల్‌ రఘునాథ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను బళ్లారి జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన విడాకుల కేసును గుర్తు చేసుకున్నారు. 'మైసూరులోని ఓ భార్య తన భర్తకు మూడు పూటలా (టిఫిన్‌, లంచ్, డిన్నర్‌) నూడుల్సే పెట్టేది. ఆమె షాప్‌కు వెళ్లి కేవలం ఇన్‌స్టంట్‌ నూడుల్స్ మాత్రమే కొనేది. నూడుల్స్ వండడం తప్ప ఆమెకు మరేది రాదు. ఈ విషయం తెలిసి.. రోజూ మూడు పూటలు నూడుల్స్‌ తినలేక విసుగెత్తిన భర్త విడాకులు కోరాడు' అని రఘునాథ్‌ చెప్పారు. 

ఆ భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులను 'మ్యాగీ కేసు'గా నమోదు చేశాం. చాలా చిన్న కారణాలతో భార్యాభర్తలు విడాకులు కోరుతున్నారు. ఇలాంటివి ఎన్నో నేను చూశా. ప్లేట్‌లో ఉప్పును తప్పు వైపు వేయడం, పెళ్లికి కలర్‌ డ్రెస్‌ తీసుకురావకపోవడం వంటివి ఎన్నో విడాకుల కేసులు ఉన్నాయి' అని ఎంఎల్‌ రఘునాథ్‌ చెప్పారు. ఒక వ్యక్తిని పాము కాటేసిందని, ఇందులో భార్య తప్పులేకపోయినా విడాకులు కోరారన్నారు. 

విడాకులు తీసుకునే జంటలు కనీసం ఏడాదిపాటు కలసి ఉండాలనే నిబంధన ఉందని, లేదంటే కళ్యాణ మండపాల నుంచే నేరుగా విడాకుల పిటిషన్లు దాఖలయ్యేవని ఎంఎల్‌ రఘునాథ్‌ అన్నారు. ఇటీవల తెలంగాణలో కూడా ఓ వింత సంఘటన జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య మటన్ కూర వండడం లేదంటూ 100కు పదేపదే ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. చిన్న విషయానికి 100కి ఫోన్ చేసి విసిగెత్తిస్తుండడంతో న్యూసెన్స్ కేసు నమోదు చేశారు.

Also Read: Sachin Tendulkar Playing XI: ధోనీ, రోహిత్, కోహ్లీ లేరు.. సచిన్ ఐపీఎల్ 2022 జట్టు ఇదే!  

Also Read: Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News