Hair found in Food: శకున శాస్త్రం కొన్ని సంఘటనలకు సంబంధించిన శకునాల గురించి క్లుప్తంగా వివరించింది. దైనందిన జీవితంలో చెడు శకునాలు జరుగుతూనే ఉంటాయి. ఇవి భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని శకున శాస్త్రం పేర్కొంది. కొన్ని కారణాల వల్ల ఈ శకునాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ సంఘటనలను పట్టించుకోని వారు అధిక మొత్తంలో నష్టపోతున్నారని శకున శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే సకాలంలో వాటిపై శ్రద్ధ చూపితే భవిష్యత్‌లో జరిగే ఇబ్బందులను నివారించవచ్చని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇలా జరిగితే మంచిది కాదు:
చాలా సార్లు ఆహారంలో వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఇది అప్పుడప్పుడు జరుగుతాయి. ఇలా జరిగితే దానిని విస్మరించవద్దని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. కానీ ఆహారంలో తరచుగా జుట్టు వస్తే అది ఇంటి నాశనానికి దారి తీస్తుందని శాస్త్రం చెబుతోంది. ఆహారంలో తరచుగా జుట్టు రావడం ఓ చెడు శకునమని తెలిపింది. ఇలా క్రమం తప్పకండా జరిగితే డబ్బు నష్టం, ఏదైనా సంక్షోభం, నష్టానికి సంకేతాలని శకున శాస్త్రం పేర్కొంది. ఆహారంలో వెంట్రుకలు వస్తే..ఆ ఆహారాన్ని తినకూడదని.. ఆహారాన్ని ఆవుకు లేదా ఏదైనా జంతువుకు తినిపించాలని శాస్త్రం తెలిపింది. లేదంటే అలాంటి ఆహారం తినడం వల్ల పేదరికం వస్తుందని శాస్త్రం తెలుపుతోంది.
ఆహారంలో జుట్టు రావడం రాహువుకు సంకేతం:
ఆహారంలో జుట్టు రావడం అశుభమని శకున శాస్త్రం పేర్కొంది. అలాగే తరచుగా ఇలాంటి సంఘటన జరిగితే చెడు రాహువుకు సంకేతమని తెలిపింది. దీని ద్వారా అనేక రకాల నష్టాలను కలుగొచ్చని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా ఆర్థిక పురోగతిని దెబ్బతీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చేతిలో ఉండనివ్వదని శకున శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Wood Apple Benefits: మారేడు పండుతో శరీరాని ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook