Mens Health Tips: ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానం కలిగేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా సంతాన లోపంతో బాధపడే పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇందులో ఆహారపు అలవాట్లు కూడా ఒకటి. సంతానం కోరుకునే పురుషులు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
పురుషుల స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపే ఆహార పదార్థాలు :
అధిక కొవ్వు ఉండే పాలు, పాల ఉత్పత్తులు... ప్రాసెస్ చేయబడిన మాంసం... ఈ రెండింటికి పురుషులు దూరంగా ఉండాలి. అలాగే ధూమపానం, మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది.
అధిక కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు :
పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు సైతం డైట్లో పాలను చేర్చుకోమని సూచిస్తుంటారు. అయితే అధిక కొవ్వు ఉన్న పాలు లేదా పాల ఉత్పత్తులను తినడం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. పాల ఉత్పత్తి పెరిగేందుకు కొంతమంది పశువులకు స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. ఈ పాలను తీసుకోవడం ద్వారా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం పడుతుంది. కాబట్టి పాల ఉత్పత్తులు పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకోవాలి.
ప్రాసెస్ చేయబడిన మాంసం:
మీరు త్వరలో తండ్రి కావాలనుకుంటున్నట్లయితే... ఇప్పటినుంచే ప్రాసెస్ చేయబడిన మాంసం తినడం మానేయండి. ప్రాసెస్ చేయబడిన మాంసం తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్ తగ్గడంతో పాటు హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని దూరం పెట్టండి.
ధూమపానం, మద్యపానం :
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం... మద్యపానం,ధూమపానం టెస్టోస్టెరాన్‌పై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా పురుషుల్లో సంతానలేమి సమస్య తలెత్తవచ్చు. కాబట్టి మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్న పురుషులు వెంటనే దాన్ని మానుకుంటే మంచిది.
Also Read: Harish Rao: ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు... ప్రధాని నరేంద్ర మోదీకి హరీశ్ రావు గట్టి కౌంటర్...
Also Red: Viral News: 23 ఏళ్లు కేవలం సాండ్‌విచ్‌లతోనే బతికేసింది... హిప్నటిజంతో ఆమె జీవితంలో ఊహించని మిరాకిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి