Stalin Demands Modi: హిందీ లాగే తమిళంను జాతీయ భాషగా ప్రకటించండి... స్టేజీ పైనే మోదీకి స్టాలిన్ డిమాండ్...

Stalin Demands Modi: హిందీ లాగే తమిళంను కూడా అధికార భాషగా ప్రకటించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 08:59 PM IST
  • ప్రధాని మోదీకి స్టాలిన్ డిమాండ్
  • హిందీ లాగే తమిళంను జాతీయ భాషగా ప్రకటించాలని డిమాండ్
  • నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని విజ్ఞప్తి
Stalin Demands Modi: హిందీ లాగే తమిళంను జాతీయ భాషగా ప్రకటించండి... స్టేజీ పైనే మోదీకి స్టాలిన్ డిమాండ్...

Stalin Demands Modi: ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన వేళ తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ఓ డిమాండును ముందుకు తెచ్చారు. హిందీ లాగే తమిళంను అధికారిక భాషగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో, మద్రాస్ హైకోర్టులో తమిళ భాషను అధికారిక భాషగా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానితో వేదికను పంచుకున్న స్టాలిన్ ఆయన ఎదుటే ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం. 

'నీట్' అంశాన్ని కూడా స్టాలిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు ఇప్పటికీ గవర్నర్ వద్దే ఉంది. గతంలో ఓసారి గవర్నర్ వద్దకు ఈ బిల్లును పంపించగా.. ఆయన తిప్పి పంపించారు. దీంతో అసెంబ్లీలో మరోసారి బిల్లు పాస్ చేసి గవర్నర్‌కు పంపించినప్పటికీ ఆయన కేంద్రానికి పంపించలేదు.

నీట్ బిల్లు విషయంలో గవర్నర్ ఆమోదం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదని... బిల్లును రాష్ట్రపతికి పంపించేందుకు గవర్నర్ పోస్ట్‌మ్యాన్‌లా వ్యవహరిస్తే సరిపోతుందని తాజాగా స్టాలిన్ వ్యాఖ్యానించారు. నీట్ కారణంగా తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయిన నేపథ్యంలో తమిళ సర్కార్ నీట్‌ను వ్యతిరేకిస్తూ యాంటీ నీట్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

స్టాలిన్‌కు మోదీ రిప్లై ఇదే :

తాజా కార్యక్రమంలో స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. 'తమిళ భాష శాశ్వతమైనది. తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తమైనది. చెన్నై నుంచి కెనడా వరకు, మధురై నుంచి మలేషియా వరకు, నమక్కల్ నుంచి న్యూయార్క్ వరకు, సాలెం నుంచి సౌతాఫ్రికా వరకు... సంక్రాంతి, పుతండు వంటి పండగలు గొప్పగా గుర్తించబడ్డాయి.' అని మోదీ పేర్కొన్నారు. కాగా, చెన్నై పర్యటనలో భాగంగా రూ.31,400 కోట్ల విలువైన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మోదీ లాంచ్ చేశారు.
 

Also Read: Varuntej about f3 movie : ఎఫ్3 ఫ్యామిలీ అంతా కలసి మళ్లీ మళ్లీ చూస్తారు : వరుణ్ తేజ్‌

Also Read: Banking Rules: నేటి నుంచి కొత్త రూల్స్... ఆ పరిమితి దాటే లావాదేవీలకు ఆధార్, పాన్ తప్పనిసరి... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News