Indian Railways: మీ రైలు టికెట్‌పై మరో వ్యక్తి ప్రయాణం చేయవచ్చని మీలో ఎంతమందికి తెలుసు. భారతీయ రైల్వే మీ టికెట్ మరో వ్యక్తికి ఎలా బదిలీ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ వెసులుబాటు గురించి తెలుసుకుందాం.
రైల్వే ప్రయాణీకులకు ఇది గుడ్‌న్యూస్. మీ రైల్వే ప్రయాణం ఏదో కారణాల వల్ల రద్దైనప్పుుడు మీ రిజర్వేషన్ టికెట్‌ను మరో వ్యక్తికి బదిలీ చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్ అవసరమైనవారికి ఆ టికెట్ ఇచ్చుకోవచ్చు. రైల్వే కొత్తగా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అదెలాగో చూద్దాం.
రైల్వేలో ఇప్పటి వరకూ ప్రయాణం రద్దైనప్పుడు రిజర్వేషన్ టికెట్ రద్దు చేయడం తప్ప మర ప్రత్యామ్నాయం లేదు. మరో వ్యక్తికి ఆ టికెట్‌పై పంపించే పరిస్థితి లేదు. అవసరమైనవారికి మీ రిజర్వేషన్ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అయితే ఇండియన్ రైల్వే ఇప్పుడా అవకాశాన్ని కల్పిస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన చాలాకాలం నుంచే అమల్లో ఉన్నా..ఎవరికీ తెలియదు.
మీ కుటుంబంలో తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, కొడుకు, కూతురు, భార్య ఇలా ఎవరికైనా మీ రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు. దీనికోసం ట్రైన్ డిపార్చర్ సమయానికి 24 గంటల ముందు రిక్వెస్ట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ టికెట్‌పై ప్రయాణీకుడి పేరు తొలగించి ఎవరికి బదిలీ చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు ఇవ్వాలి. అంతే ఆ వ్యక్తి పేరుపై టికెట్ బదిలీ అవుతుంది. ప్రయాణీకుడు ప్రభుత్వ ఉద్యోగి అయితే..విధి నిర్వహణకై వెళ్తుంటే రైలు డిపార్చర్ సమయానికి 24 గంటల ముందు రిక్వెస్ట్ ఇవ్వాలి. ఏదైనా పెళ్లికి వెళ్తున్న ప్రయాణీకుల విషయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే మాత్రం 48 గంటల ముందు రిక్వెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిక్వెస్ట్ ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు.
అయితే రైల్వే టికెట్ బదిలీ అనేది కేవలం ఒకసారే చేయవచ్చు. టికెట్ ప్రింట్ తీసుకుని రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు నింపి..ఎవరిపేరుపై అయితే టికెట్ బదిలీ చేస్తారో వారి ఐడీ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.
Also read: Redmi Note 10T Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. రూ.749 ధరకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook