Radish side effects: కొన్ని కూరగాయలు పచ్చిగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆహార రుచిని పెంచడానికి కూడా దోహదపడుతాయి. ఈ కూరగాయలలో ముల్లంగి కూడా ఒకటి. కావున ప్రస్తుతం ముల్లంగి వినియోగం పెరిగింది. దీనిని పరాటాల నుంచి సలాడ్‌ల వరకు అన్ని వంటకాలలో వాడుతున్నారు. కావున మార్కెట్‌లో దీని విక్రయ శాతం పెరిగింది. అంతేకాకుండా దీనిని చాలా మంది ఇష్టంగా తింటున్నారు.
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ముల్లంగి చాలా అరుదుగా మార్కెట్‌లో లభిస్తుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం.. ముల్లంగిని తినడం ద్వారా ఎన్ని ప్రయోజనాలుంటాయో.. ఎక్కువ తినడం వల్ల అంతే దుష్ప్రభావాలుంటాయని నిపుణులు పేర్కొన్నారు. ముల్లంగి తినే వారు పలు రకాల విషయాలను గుర్తుంచుకొని తినాలని వారు తెలుపుతున్నారు. ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వారు వీటిని తినే ముందు పలు జాగ్రత్తలు పాటిస్తూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ముల్లంగి తింటే ఎలాంటి దుష్ప్రభావాలుంటాయో తెలుసుకుందాం..
శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది:
ముల్లంగిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. దీనిని తినడం వల్ల ఎక్కువ మూత్రవిసర్జన జరుగుతుంది. దీంతో శరీరంలోని నీటి కోరత ఏర్పడుతుంది.
రక్తలో చెక్కర స్థాయి తగ్గిస్తుంది:
ముల్లంగిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తలో చెక్కర స్థాయి తగ్గి రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు ముల్లంగిని అధికంగా తినడం మానుకోవాలి.
హైపోగ్లైసీమియా సమస్యలు:
రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్న వ్యక్తులు ముల్లంగిని ఎక్కువగా తినకుండా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ముల్లంగిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపోగ్లైసీమియా సమస్య వచ్చే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు.
Also Read: Coffee Facial At Home: ఇక నుంచి పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఇలా ముఖానికి కాఫీ వాడడండి.!!
Also Read: High Cholesterol: ఈ 4 లక్షణాలు కొలెస్ట్రాల్ పెరిగుదలను సూచిస్తాయి..ఇవి పెరిగితే గుండెపోటు తప్పదు.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి