Vishwak Sen movie Ashoka Vanamlo Arjuna Kalyanam streaming from May 27th on Aha టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, యూకే భామ రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇక ఏవీఏకే సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.
'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో విడుదల కానుంది. మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విషయం తెలిసిన ఫాన్స్ ఆనందం వ్యక్తం చుస్తున్నారు. థియేటర్ వెళ్లని అభిమానులు ఎంచక్కా ఇంట్లోనే ఏవీఏకే సినిమా చూడనున్నారు. ఫలక్‌నుమా దాస్, హిట్, పాగల్ చిత్రాలతో విశ్వక్ సేన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఏవీఏకే సినిమాను ఫ్యాన్సీ రేటుకు ఆహా వీడియో కొనుగొలు చేసినట్టు తెలుస్తోంది. థిరెటికల్ రన్ నెల రోజులు కాకముందే సినిమా ఓటీటీలోకి వస్తుండడం విశేషం. రాధేశ్యామ్ నెల రోజుల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
గ్రామీణా నేపథ్యంలో తెరకెక్కిన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా పెళ్లి అనే కన్సెప్ట్ చూట్టూ తిరుగుతుంది. 33 ఏళ్లు వచ్చినా పెళ్లికాని యువకుడు పడే బాధ, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో సాగే ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ ఏవీఏకే.. ఓటీటీలో కూడా సందడి చేయనుంది. విడుదలకు ముందు ఈ సినిమాకు అంతగా బజ్ లేదు కానీ.. విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో వైరల్ అవడంతో ఓ రేంజ్లో పబ్లిసిటీ అయింది.
బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రాన్ని నిర్మించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. విశ్వక్ సేన్‌కు విద్యాసాగర్ చింతా 'ఫలక్‌నూమా దాస్' రూపంలో ఇప్పటికే ఓ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read: F3 Ticket Price: సినీ అభిమానులకు శుభవార్త.. ఎఫ్ 3 టికెట్స్ రేట్స్ యథాతథం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.