cbi raids on chidambaram: చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు

cbi raids on chidambaram: కాంగ్రెస్‌ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది. మొత్తం 9 చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 10:20 AM IST
  • చిదంబరం, కార్తి చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు
  • 9 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ
  • గతంలోనూ కార్తి చిదంబరం ఆస్తులపై సీబీఐ సోదాలు
cbi raids on chidambaram: చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు

cbi raids on chidambaram: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది. మొత్తం 9 చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.  2010-2014 మధ్య కార్తీ విదేశీ చెల్లింపుల వ్యవహారానికి సంబంధించి ఈ సోదాలు జరిగుతున్నట్లు తెలుస్తోంది.

చెన్నైలో మూడు చోట్ల, ముంబైలో మూడు చోట్ల, కర్ణాటక, పంజాబ్, ఒడిశాలో ఒక్కో ఏక కాలంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. సాబూ అనే వ్యక్తి నుంచి కార్తీ 50 లక్షలు అందుకున్నట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. 2019లో కూడా సీబీఐ కార్తికి చెందిన 16 ఆస్తులపై దాడులు నిర్వహించింది. యూపీఏ హయాంలో తన తండ్రి చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్‌ఎక్స్ మీడియా 305 కోట్ల మేర విదేశీ నిధులు స్వీకరించేందుకు వీలుగా సెంట్రల్ ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతులు ఇప్పించేందుకు ముడుపులు తీసుకున్నట్లు కార్తి సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో పాటు పలు కేసుల్లో విచారణ కొనసాగుతోంది.

2019 ఆగస్తు 21న ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో పీ. చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. అదే ఏడాది అక్టోబర్‌ 16న మనీలాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ తమ కస్టడీలోకి తీసుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఈడీ కేసుకు సంబంధించి తీహార్ జైల్లో చిదంబరం ఉండాల్సి వచ్చింది. 100 రోజుల తర్వాత బెయిల్ లభించడంతో 2019 డిసెంబర్‌లో ఆయన బయటకొచ్చారు. తాజాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో నిందితులను విచారించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని భావించిన ప్రత్యేక కోర్టు..ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంది.

మరోవైపు తాజాగా సీబీఐ సోదాలపై కార్తి చిదంబరం ట్విటర్ వేదికగా స్పందించారు. తనపై ఎన్నిసార్లు దాడులు జరిగాయోలో గుర్తు లేదనీ. ఆ లెక్క ఎంతని ప్రశ్నించారు. అయితే అదో రికార్డు అవుతుందంటూ ట్వీట్ చేశారు.

 

Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. ఈదురుగాలులు కూడా!

Also Read:Tuesday Remedies: హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు మంగళవారం ఈ పనులు చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News