Tamil Nadu Mother Petchiammal Becomes a Tom Man for her Daughter Safely: భామనే సత్య భామనే సినిమాలో కమల్ హాసన్, రెమో సినిమాలో శివకార్తికేయన్ ఆడాళ్ల వేషం వేసి.. హడిప్ప సినిమాలో రాణి ముఖర్జీ మగ వేషం వేసి చాలా కష్టపడతారు. ఓ స్త్రీ పురుషుడిగా, ఓ పురుషుడు స్త్రీగా మారాలంటే చాలా కష్టం. సినిమాల్లో చూపించినంత ఈజీగా ఉండదు నిజ జీవితంలో. అయినా కూడా ఓ మహిళ తన కూతురి కోసం ఏకంగా 30 ఏళ్లుగా పురుష అవతారం ఎత్తి జీవిస్తోంది. భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవడం కోసం పురుషుడిగా మారింది. వివారాల్లోకి వెళితే..
పెచ్చియమ్మాళ్‌ది తమిళనాడులోని తూతుకూడి జిల్లా కతునాయకన్‌పట్టి గ్రామం. పెచ్చియమ్మాళ్‌కు పెళ్లయిన 15 రోజులకే ఆమె భర్త శివ మరణించాడు. అప్పటికే గర్భంతో ఉన్న ఆమె షణ్ముగ సుందరికి జన్మనిచ్చింది. ఆమెకు అప్పుడు 20 ఏళ్లు. పెచ్చియమ్మాళ్ మళ్లీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. తన కుమార్తె కోసం భవన నిర్మాణ స్థలాలు, హోటళ్ళు మరియు టీ షాపులలో పనిచేసేది. ఒంటరి స్త్రీ, పైగా వయసులో ఉంది కాబట్టి ఆమెకు పనిచేసే చోట వేధింపులు ఎక్కువయ్యాయి. పలుమార్లు లైంగిక వేధింపులను ఎదుర్కొంది.
ఒంటరి స్త్రీగా తనకు, కుమార్తెను కాపాడుకోవడానికి తూతుకూడి జిల్లాలోని రెండు మూడు ఊళ్లలో ప్రయత్నించింది పెచ్చియమ్మాళ్. ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు మాత్రం ఆగలేదు. దాంతో తన ప్రాణం, తన ఉనికి కంటే.. కుమార్తె ఉనికి ముఖ్యం నిర్ణయించుకుంది. అందుకు పురుషుడుగా మారాలని పెచ్చియమ్మాళ్ నిర్ణయించుకుంది. చొక్కా మరియు లుంగీ కట్టుకుని తన వేషధారణను పూర్తిగా మగాడిలా మార్చుకుంది. తన పేరును ముత్తుగా మార్చుకుని కతునాయకన్‌పట్టికి వచ్చింది. కూలి పనులు, పెయింటింగ్ పని చేసింది. ఎక్కువ కాలం హోటల్‌లో పరోటా మాస్టర్‌గా, టీ మాస్టర్‌గా పని చేసింది. దాంతో ఆమెను ఊళ్లో అందరూ 'ముత్తు మాస్టర్' అని పిలిచేవారు.
ముత్తు మాస్టర్ ఈ పనులన్నీ చేసుకుంటూ కూతురిని పెంచి పెద్ద చేసింది. ఊళ్లో అందరూ తండ్రీ కూతుళ్లు జీవిస్తున్నారని భావించేవారు.దాంతో వారికి ఎలాంటి సమస్యలు రాలేదు. దాంతో పెచ్చియమ్మాళ్ 30 ఏళ్లుగా మగవాడినే ఉంది. ఇప్పుడు ఆమె వయసు 57 సంవత్సరాలు. షణ్ముగ సుందరికి ఇప్పుడు వివాహమైంది. ఆమె కుటుంబం ఆర్థికంగా బాగానే ఉంది. అయితే పెచ్చియమ్మాళ్‌కు వయసు మీద పడింది. మునుపటిలా పని చేయలేకపోతోంది. దాంతో వితంతువు పెన్షన్ కోసం అసలు అవతారాన్ని బయటపెట్టింది. తాను స్త్రీనని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
తన కూతురు, దగ్గరి వారైన 2-3కి తప్ప ఇప్పటి వరకూ ఆ సంగతి కతునాయకన్‌పట్టిలో ఎవరికీ తెలియదు. పెచ్చియమ్మాళ్ ఆధార్ కార్డు కూడా 'ముత్తు' పేరుతోనే ఉంది. ఆమె దగ్గర భర్త శివ డెత్ సర్టిఫికెట్ లేదు. దాంతో ఆమెకు వితంతు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వంకు పెద్ద సమస్యగా మారింది. తనకు సహాయం చేయాలని అసలు విషయాన్ని మీడియాతో చెప్పుకుంది. అయితే తాను ఎప్పటికీ పురుషుడిగానే ఉంటానని, తాను చనిపోయాక ముత్తుగానే అందరూ గుర్తు చేసుకోవాలని పెచ్చియమ్మాళ్ కోరింది. పెచ్చియమ్మాళ్‌కు వితంతు పెన్షన్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.
Also Read: PBKS vs DC Playing 11: పంజాబ్, ఢిల్లీ మధ్య 'డు ఆర్ డై' ఫైట్.. ఓడిన జట్టు ఇంటికే! తుది జట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.