Lunar Eclipse 2022: ఈ ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం నేడు (మే 16) సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 07.57 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.20 వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 5 గంటల పాటు చంద్రగ్రహణం కొనసాగనుంది. చంద్రగ్రహణం సమయంలో నిండు చంద్రుడు ఎర్రగా కనిపిస్తున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అంటారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ భారతీయులు కూడా బ్లడ్ మూన్ ను చూడొచ్చు. అదెలోగా ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లడ్ మూన్ ఎలా చూడొచ్చు!
అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు బ్లడ్ మూన్ కు సంబంధించిన అందమైన, ఉత్తేజకరమైన దృశ్యాన్ని చూడగలరు. నాసా ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించింది. ప్రజలు నాసా సైట్, ట్విట్టర్ ద్వారా బ్లడ్ మూన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
LIVE: Watch the total lunar eclipse with NASA!
We're streaming eclipse views from around the world and talking with our lunar experts. Send us your Moon questions using #AskNASA: https://t.co/zhsa12QW50
— NASA (@NASA) May 16, 2022
బ్లడ్ మూన్ అని ఎందుకు అంటారంటే?
చంద్రగ్రహణం రోజున చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని అంటారు. అయితే చంద్రగ్రహణం సమయంలో చంద్రుని రంగు మారడం గురించి శాస్త్రీయ అంశం ఏమిటంటే.. ఈ సమయంలో సూర్యకాంతి భూమి ద్వారా చంద్రునిపై పడుతుంది. అటువంటి నీడ కారణంగా.. గ్రహణ సమయంలో చంద్రుని రంగు ఎరుపు, రాగి వలె కనిపిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో రక్త చంద్రుడిని చూడాలనుకునే వారు నాసా సైట్ లేదా ట్విట్టర్ ఖాతాను సందర్శించడం ద్వారా దాని ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
Also Read: Chandra grahanam 2022: ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం ప్రభావం ఆ 4 రాశులపై ఎలా ఉంటుంది
Also Read: Vaisakha Purnima 2022: వైశాఖ పౌర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ నాడు ఏం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.