Cyber Crimes Alert: సైబర్ నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతే సంగతులు. డబ్బులు స్వాహా చేయడం..ఎక్కౌంట్లు హైజాక్ చేయడం సర్వసాధారణమైపోయింది. అందుకే సైబర్ దోస్త్ పలు సూచనలు జారీ చేస్తోంది.
లోకమంతా ఇంటర్నెట్ ప్రపంచంగా మారిన క్రమంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు అధికమౌతున్నాయి. ఎక్కౌంట్లలో డబ్బులు స్వాహా చేయడం, సోషల్ మీడియా ఎక్కౌంట్లు హ్యాక్ చేయడం పరిపాటిగా మారింది. సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని జాగ్రత్తలు సూచిస్తున్నా..అంతే స్థాయిలో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలోసైబర్ దోస్త్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కీలకమైన సూచనలు చేస్తోంది. సైబర్ దోస్త్ ద్వారా సైబర్ మోసాలపై ట్విట్టర్ ద్వారా పలు సూచనలు జారీ చేస్తోంది.
సోషల్ మీడియా వేదికగా వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని పదే పదే హెచ్చరిస్తున్నారు. పాన్‌కార్డు నంబర్, పాన్‌కార్డ్ ఫోటో వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితోనూ షేర్ చేయవద్దని సూచిస్తున్నారు. ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దంటున్నారు. మీకు తెలియని వ్యక్తులతో మీ బ్యాంకు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు షేర్ చేసుకోవద్దు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సంబంధిత బ్యాంక్, సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రిత్వశాఖ సైబర్ దోస్త్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది.
Also read: Assam Floods: అస్సోంలో భారీ వర్షాలు, పోటెత్తుతున్న వరద, 25 వేలమంది నిరాశ్రయులు, మృతుల సంఖ్య ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook