Horoscope Today May 13 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది..

Horoscope Today  May 13 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి తదితర రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం గోచరిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 06:36 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ మేష, వృషభ, కర్కాటక రాశుల వారికి శుభ ఫలితాలు
  • మిథున, తులా రాశులు సహా పలు రాశుల వారికి ప్రతికూల ఫలితాలు
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
 Horoscope Today May 13 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది..

Horoscope Today May 13 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి తదితర రాశుల వారికి శుభం కలగబోతుందని జ్యోతిష్య శాస్త్రం గోచరిస్తోంది. మిథున రాశి, తులా రాశి సహా మరికొన్ని రాశుల వారికి ఇవాళ ఆశించిన పనులు జరగకపోవచ్చునని శాస్త్రం చెబుతోంది. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. 

మేషరాశి ( Aries)

ఫ్యామిలీ గెట్ టు గెదర్ లేదా సోషల్ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. మీ చుట్టూ ఉన్నవారితో ఎప్పుడూ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటికి సంబంధించి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ బంధువు ఒకరి నుంచి శుభవార్త వింటారు. కొన్ని పనులు తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ... దీర్ఘకాలంలో మీకు మంచి ఫలితాలనిస్తాయి.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. తద్వారా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ ఏకాగ్రత బాగుంటుంది. వ్యాపార పురోగతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనిస్తారు.

మిథున రాశి (GEMINI)

పాత అనారోగ్య సమస్యలు మళ్లీ తిరగబెడుతాయి. రోజంతా విచారకరంగా గడుస్తుంది. అడ్వెంచర్ టూర్స్, లాంగ్ డ్రైవ్స్ మానుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసర విషయాల పట్ల లేని పోని చర్చలు చేయకండి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

కర్కాటక రాశి (Cancer) 

ఈరోజంతా సంతోషంగా గడుపుతారు. వృత్తిపరంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ మరింత పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో అవి మంచి ఫలితాలనిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. తద్వారా మీ సేవింగ్స పెరుగుతాయి. వ్యాపార విస్తృతి కోసం భారీ పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.

సింహ రాశి (LEO)

ఇవాళ సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని భారం, ఒత్తిడి కారణంగా కుటుంబంతో తగిన సమయం గడపలేరు. మానసికంగా అలసిపోతారు. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు జాబ్ ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహాయ సహాకారాలు లభిస్తాయి.

కన్య రాశి (Virgo)

వ్యాపారంలో లాభాలు పొందుతారు. అదృష్టం ఇవాళ మీ వెన్నంటే ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. వాయిదా వేసిన పనులను తిరిగి చేపట్టేందుకు ఇది సానుకూల సమయం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆపదలో ఉన్నవారికి లేదా మతపరమైన కార్యక్రమాలకు తోచిన ఆర్థిక సాయం అందిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

తులా రాశి (Libra)

ఇవాళ మీ జాతకంలో చంద్రుడు ప్రతికూల స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ప్రస్తుతానికి పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు నష్టాలుగా మారుతాయి. స్థిరాస్తి పెట్టుబడులు తాత్కాలికంగా వాయిదా వేయండి. వివాదాల్లో తలదూర్చి ఇంటిదాకా తెచ్చుకోవద్దు. 

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ మీపై చంద్ర అనుగ్రహం ఉంటుంది. వృత్తిపరంగా గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా, సాఫీగా సాగుతుంది. అనవసర అంశాలపై చర్చలు చేయవద్దు. ఓవర్ ఎగ్జయిట్‌మెంట్ మీ సహనాన్ని పరీక్షిస్తుంది. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ధనుస్సు రాశి (Sagittarius)  

చంద్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో ప్రేమానురాగాలు పొందుతారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నవారికి తగిన సంబంధం దొరుకుతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగా రాణిస్తారు. పాత పెట్టుబడులు ఇప్పుడు లాభాలు కురిపిస్తాయి. సంపద పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు.

మకర రాశి (Capricorn) 

ఇవాళ మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. మీరు చేపట్టిన ప్రతీ పని పురోగతి సంతరించకుంటుంది. మీ ప్రత్యర్థులు మీ ఎదుగుదలను అందుకోలేరు. ప్రస్తుతానికి వారు మీ జోలికి రానే రారు. కెరీర్ పరంగా విద్యార్థులకు అనుకూల సమయం. శ్రద్ధ పెట్టి చదివితే పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

కుంభ రాశి (Aquarius)

ఇవాళంతా నిరాశజనకంగా గడుస్తుంది. సాయంత్రం సమయానికి మిమ్మల్ని వెంటాడుతున్న నెగటివిటీ వీడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. వారి సాయంతో బిజినెస్ ప్లాన్స్ చేస్తారు. వ్యాపారంలో ముందడుగు వేసేముందు దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మీన రాశి (Pisces) 

పెద్దల ఆశీస్సులతో అన్నింటా రాణిస్తారు. వృత్తిరీత్యా కొలిగ్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. డైరీ, వాటర్ ప్రాజెక్ట్స్, తృణ ధాన్యాలు, ఇతరత్రా వ్యాపార రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది. వ్యాపార పరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంతో తగిన సమయం గడపలేరు.

Also Read: Teenmar Mallanna Interview: జీ న్యూస్ తెలుగు స్టూడియోలో ఎక్స్‌క్లూజీవ్‌గా తీన్మార్ మల్లన్న.. బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో

Also Read: Sarkaru Vaari Paata Collections : సర్కారు వారి పాటతో మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News