China Crashes: చైనాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి చోంగ్‌క్వింగ్‌లో టోకాఫ్ అవుతుండగా రన్‌వేపై విమానం అదుపు తప్పింది. దీంతో ఒక్కసారి విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన విమాన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.
గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాద సమయంలో ఒక్కసారి మంటలు, పొగలు భారీ ఎత్తున వ్యాపించాయి. ఇందుకు సంబంధించి విజువల్స్ వైరల్‌గా మారాయి. ప్రమాద సమయంలో విమానంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రన్‌వేను మూసివేశారు. టిబెట్‌లోని నియింగ్చ్‌కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఇటీవల సమయంలో ఇది రెండో విమాన ఘటన. ఈఏడాది మార్చి 12 జరిగిన విమాన ప్రమాదంలో 9 మంది సిబ్బందితోపాటు 132 మంది మరణించారు.
విమాన ప్రమాదంపై జిన్‌పింగ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై జిన్‌పింగ్ ఆరా తీశారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. విమాన ప్రమాదంతో చోంగ్‌క్విన్‌లో కలకలం రేగింది.
Also read:RRR OTT Release Date: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ రిలీజ్ ముహూర్తం కుదిరింది!
Also read:CSK VS MI: ధోనీ సేన ప్లే ఆఫ్స్‌కు చేరేనా..? నేడు కీలక మ్యాచ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook