/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Telangana New Secretariat Building: తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ నిర్మాణ పనులను రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న కొత్త సచివాలయ ప్రాంగణం అంతా కలియదిరిగారు. అంతస్తుల వారీగా పనులు ఎలా సాగుతున్నాయో, పురోగతి ఎలా ఉందో పరిశీలించారు. మంత్రుల ఛాంబర్లు, అధికారులకు సంబంధించిన ఛాంబర్లు, ఆయా బ్లాక్‌లలో వర్క్‌ స్టేషన్‌ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏయే విభాగాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉండాలో అధికారులకు సూచనలు చేశారు. భవన సముదాయంలోని మెయిన్‌ ఎలివేషన్‌ ఫినిషింగ్‌ ఏరియాలో ఉపయోగించేందుకు ఇటీవలే తెప్పించిన దోల్‌పూర్‌ స్టోన్‌ను కూడా మంత్రి వేముల పరిశీలించారు.

ఇటీవల సీఎం కేసీఆర్‌ కూడా సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులు, మంత్రి వేములకు పలు సూచనలు చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలు, సూచనలు నిర్మాణంలో పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇకపై నిరంతరాయంగా సచివాలయ నిర్మాణ పనులు సాగాలని, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వేముల ఆదేశించారు. ముఖ్యంగా ఫినిషింగ్‌ పనులపై శ్రద్ధ పెట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ అండ్‌బీ అధికారులకు సూచించారు. 

ప్రపంచమే అబ్బురపోయే విధంగా తెలంగాణ కొత్త సెక్రెటేరియట్‌ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా సాగుతోందని ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణకే తలమానికంగా వెలుగొందుతుందని అభిప్రాయపడ్డారు. సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన సమయంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) వెంట ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌.. గణపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శశిధర్,ఎస్‌ఈలు సత్యనారాయణ, లింగారెడ్డితో పాటు.. అర్ అండ్ బి అధికారులు, సచివాలయం వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ తదితరులు ఉన్నారు.

Also read : Teenmar Mallanna Political Plans: తీన్మార్‌ మల్లన్న ఏం చేయబోతున్నారు ? అనూహ్య నిర్ణయాల వెనుక వ్యూహమేంటి ?

Also read : Unemployed Protest: మాకు అవకాశం ఇవ్వండి..అభ్యర్థుల ఆందోళన..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
minister vemula prashanth reddy visits telangana new secretariat building construction site
News Source: 
Home Title: 

Telangana New Secretariat: కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం ఎక్కడివరకొచ్చింది ? సచివాలయ ప్రాంగణంలో మంత్రి వేముల

Telangana New Secretariat: కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం ఎక్కడివరకొచ్చింది ? సచివాలయ ప్రాంగణంలో మంత్రి వేముల
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

నిర్మాణం జరుగుతున్న కొత్త సచివాలయ ప్రాంగణం అంతా కలియదిరిగిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

అంతస్తుల వారీగా పనులు ఎలా సాగుతున్నాయో పరిశీలించిన మంత్రి

ప్రపంచమే అబ్బురపోయే విధంగా నిర్మాణం ఉంటుందంటున్న మంత్రి

Mobile Title: 
Telangana New Secretariat:కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం ఎక్కడివరకొచ్చిందని మంత్రి ఆరా
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, May 9, 2022 - 23:06
Request Count: 
102
Is Breaking News: 
No