Asani Cyclone Live Update: అసని తీవ్ర తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. తుపాను కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను తీవ్ర తుపానుగా మారి..పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. అసని తీవ్ర తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఏపీవైపుకు దూసుకొస్తోంది. ప్రస్తుతం అసని తుపాను ఎక్కడ కేంద్రీకృతమైందో విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ వెల్లడించారు. కాకినాడ, విశాఖపట్నంకు 390 కిలోమీటర్ల దూరంలో..గోపాలపురంకు 510 కిలోమీటర్లు, పూరీకు 580 కిలోమీటర్ల దూరంలో అసని తుపాను కేంద్రీకృతమై ఉంది.
తుపాను ప్రభావంతో రేపు సాయంత్రం నుంచి కోస్తాంధ్రలో, ఎల్లుండి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి బారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. తుపాను నేపధ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాల్ని అప్రమత్తం చేశారు. సముద్రంలో అలలు ఎగసిపడనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
అసని తీవ్ర తుపాను రేపటికి ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి చేరువలో రానుంది. అక్కడి నుంచి దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ..వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా వైపుకు ప్రయాణించనుంది. రేపు సాయంత్రం నుంచి తీవ్ర తుపాను క్రమంగా తిరిగి తుపానుగా బలహీనపడనుంది. తుపాను నేపద్యంలో విశాఖ ప్రాంతంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణం కారణంగా పలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి.
Also read: Asani Cyclone Effect: ఏపీపై అసని తుపాను ప్రభావం, విశాఖ వెళ్లే విమానాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook