Xiaomi Alligations on ED: డబ్బుల కోసం ఈడీ వేధిస్తోంది...ఆరోపించిన షావోమీ

Xiaomi Alligations on ED: షావోమీకి వ్యతిరేకంగా ఇటీవల నమోదైన మనీలాండరింగ్​ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. షావోమీ సంస్థ నిబంధలను ఉల్లంఘించి చైనాలోని తన మాతృ సంస్థకు వేలాది కోట్ల రూపాయలను తరలించిందని ఈడీ ఆరోపిస్తోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 08:03 PM IST
  • సంస్థ ప్రతినిధులను ఈడీ ఆఫీసర్లు కొట్టారని ఆరోపణ
  • షావోమీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు - ఈడీ
  • విదేశీ పెట్టుబడిదారులు మాత్రం ఆందోళన
Xiaomi Alligations on ED: డబ్బుల కోసం ఈడీ వేధిస్తోంది...ఆరోపించిన షావోమీ

Xiaomi Alligations on ED: షావోమీకి వ్యతిరేకంగా ఇటీవల నమోదైన మనీలాండరింగ్​ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. షావోమీ సంస్థ నిబంధలను ఉల్లంఘించి చైనాలోని తన మాతృ సంస్థకు వేలాది కోట్ల రూపాయలను తరలించిందని ఈడీ ఆరోపిస్తోంది. పలు రోజుల పాటు సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ పలు కీలకమైన దస్తావేజులను సీజ్ చేసుకుంది. వీటి ఆధారంగా మరింత లోతైన దర్యాప్తు చేస్తామని ప్రకటించింది. అయితే  సంస్థ అధికారులు తమకు సహకరించడం లేదని ఆరోపిస్తోంది. ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం సరిగ్గా ఇవ్వడం లేదని కావాలనే కాలయాపన చేస్తున్నారని ఈడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే షావోమీ సంస్థ మాత్రం ఈడీ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేస్తోంది. 

తమ సంస్థ ప్రతినిధులను ఈడీ ఆఫీసర్లు కొట్టారని.... అడినంత డబ్బులు ఇవ్వకపోతే అక్రమ కేసులు బనాయిస్తామని  బెదిరించారని ఆరోపిస్తోంది. ఈడీ ఉన్నతాధికారులు తమ సంస్థకు  చాలా కాలంగా నిబద్ధతతో పని చేసిన తమ మాజీ ఎండీ మనుకుమార్​ జైన్​, సీఎఫ్​సీ సమీర్​ రావును బెదిరించారని ఆరోపిస్తోంది. తాము అడిగినట్లు స్టేట్​మెంట్​ ఇవ్వకుంటే  తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించిందని ఆరోపించింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించారు. షావోమీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను అడిగిన ప్రశ్నలకు కంపెనీ ఎగ్జిక్యూటివ్​లు స్వచ్ఛందంగా స్టేట్​మెంట్లు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు బెదిరించారంటూ ఆరోపణలు చేయడం తగదని అన్నారు.  తాము చట్టానికి లోబడే విచారణ జరిపుతున్నామని వెల్లడించారు.

దీంతో మొత్తం మీద ఎవరు చెప్తున్న దాంట్లో నిజం ఉందో తెలియక వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. షావోమీని ఒత్తిడికి గురి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకే ఈడీ అధికారులు ప్రయత్నించారని కొంత మంది భావిస్తే .... మరికొంత మంది మాత్రం చైనా విషయం కాబట్టే ఈడీ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే మొత్తం మీద ఈ వ్యవహారంతో విదేశీ పెట్టుబడిదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉన్నా ఎక్కడో ఒక చోట తేడా పట్టుకొని మరీ ఈడీ బెదిరింపులకు దిగితే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఇక మరోవైపు షావోమీ ‘ఇండియన్​ ఫారిన్​ ఎక్స్ఛేంజ్​ చట్టం’ లోని రూల్స్​కు వ్యతిరేకంగా రూ.5,551 కోట్ల డబ్బును సీజ్​ చేసింది. షావోమీ ఇండియా బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఈ డబ్బును సీజ్ చేసింది.  రాయల్టీల పేరుతో ఇంత భారీ మొత్తాన్ని చైనాలోని తన “పేరెంట్ గ్రూప్” సంస్థలకు సరఫరా చేస్తోందని మండిపడింది. 

also read      స్టార్టప్‌ సంస్థలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన భారత్

also read          Honey Business: తక్కువ ఖర్చు..ఎక్కువ లాభం, తేనె ప్రాసెసింగ్ యూనిట్ ఎలా పెట్టాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Trending News