Benefits Of Mint Tea: వేసవి కాలంలో చాలామంది టీకి దూరంగా ఉంటారు. ఎందుకంటే వారు శీతల పానీయం(కూల్ డ్రింక్స్) తాగడం మంచిదని వాటిని తాగేందుకు ఇష్టపడతారు. కానీ వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ శరీరానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో కూడా శరీరానికి టీ మంచి లాభాలను చేకూర్చుతుందని వారు అంటున్నారు. ముఖ్యంగా పుదీనా టీ హెల్త్‌కు చాలా మంచిదని చెబుతున్నారు. దీనిని రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి మంచి పోషకాలు ఇవ్వడమే కాకుండా రోజంతా అక్టివ్‌గా ఉంచుతుందన్నారు. శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా..వేడి శరీరం గల వ్యక్తులకు వేడి తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆయాసాన్ని కూడా దూరం చేస్తుంది. కాబట్టి వేసవిలో కూడా టీని తాగొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పుదీనా టీని తీసుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు. అయితే పుదీనా టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది:
పుదీనా టీ మీ శరీరాన్ని చల్లబర్చడమే కాకుండా..శరీరానికి విటమిన్-ఎ, విటమిన్-సి, బి-కాంప్లెక్స్, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ బాక్టీరియల్‌ను అందిస్తాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి.. మెదడుకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
2. వేడి వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గిస్తుంది:
వేసవి కాలంలో చాలా మంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీరు పుదీనా టీని తీసుకుంటే..చాలా ప్రయోజనాలు పొందుతారని అంతే కాకుండా తలనొప్పి నుంచి విముక్తి పొందుతారని వైద్యులు తెలిపారు.
3. బరువును కూడా తగ్గిస్తుంది:
బరువు తగ్గించుకోవడంలో నిమగ్నమై ఉన్నవారు తప్పుండా ఈ టీని ట్రై చేయండి. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. నిజానికి పుదీనాలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పుదీనా టీని ఎలా తయారు చేయాలి:
ముందుగా మీరు 6-7 పుదీనా ఆకులను కడగి ఉంచాలి. కొన్ని నీటిని వేడి చేసి..అందులో ఈ ఆకులను వేయాలి. ఆ తరువాత వడపోసి టీని తాగవచ్చు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Curd Benefits For Hair: పెరుగుతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
Also Read: Vitamin Deficiency: ఈ విటమిన్ శరీరానికి చాలా ముఖ్యమైనది..దీనిని విస్మరిస్తే భారీ నష్టమే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook