India Covid 19 Cases: గడిచిన రెండు రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. మొన్నటి కన్నా నిన్న 354 కేసులు తక్కువగా నమోదవగా... నిన్నటి కన్నా ఇవాళ 244 కేసులు తక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 29 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,05,401కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5,24,093కి చేరింది. ప్రస్తుతం దేశంలో 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
శనివారం (మే 7) 3805 కొత్త కరోనా కేసులు నమోదవగా ఆదివారం(మే 8) 3451, సోమవారం (మే 9) 3207 కేసులు నమోదవడం గమనార్హం. ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 3410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ రికవరీల సంఖ్య 4,25,60,905కి చేరింది.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతంగా ఉండగా... వీక్లీ పాజిటివిటీ రేటు 0.82 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 3,36,776 శాంపిల్స్‌ను పరీక్షించగా... ఇప్పటివరకూ మొత్తం 84.10 కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించారు.
ఒడిశాలో 64 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా :
ఒడిశాలోని రాయగడ జిల్లాలో 64 మంది స్కూల్ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ విద్యార్థులెవరిలోనూ కోవిడ్ లక్షణాలు బయటపడలేదని జిల్లా మెజిస్ట్రేట్ అధికారి సరోజ్ కుమార్ మిశ్రా తెలిపారు.
అహ్మదాబాద్ ఎన్ఐడీలో 24 మంది విద్యార్థులకు కరోనా :
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID)లో గడిచిన 3 రోజుల్లో 24 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఇందులో 16 మందికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఎన్ఐడీ క్యాంపస్‌లో అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: F3 Movie Trailer: మరోసారి ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో వెంకటేష్, వరుణ్ తేజ్!
Also Read: Happy Birthday Vijay Deverakonda: సమంత, పేరెంట్స్‌తో రౌడీ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook