Assam Tornado: అస్సోం బార్పేటలో విరుచుకుపడిన టోర్నడో, వైరల్ అవుతున్న వీడియో

Assam Tornado: అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని తరచూ చుట్టుముట్టే టోర్నడోలు ఇండియాలో కూడా సంభవిస్తున్నాయి. అస్సాంలోని బార్పేటలో అటువంటిదే ఓ టోర్నడో చుట్టుముట్టింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2022, 05:18 PM IST
  • అస్సాం బార్పేట జిల్లాను ఢీ కొట్టిన టోర్నడో
  • ఈ కాలంలో ఇది సహజమే అంటున్న స్థానికులు
  • మొబైల్ తో చిత్రీకరించిన ఈ వీడియో నెట్టింట వైరల్
 Assam Tornado: అస్సోం బార్పేటలో విరుచుకుపడిన టోర్నడో, వైరల్ అవుతున్న వీడియో

Assam Tornado: అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని తరచూ చుట్టుముట్టే టోర్నడోలు ఇండియాలో కూడా సంభవిస్తున్నాయి. అస్సాంలోని బార్పేటలో అటువంటిదే ఓ టోర్నడో చుట్టుముట్టింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అస్సోం నుంచి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆ రాష్ట్రంలోని స్థానికులు మొబైల్ ఫోన్‌తో చిత్రీకరించారు. గాలి దుమ్ముతో కూడిన సుడిగుండం ఒకటి భూమి నుంచి కొన్ని మీటర్ల ఎత్తువరకూ వ్యాపించి..నెమ్మదిగా చుట్టుకుంటూ వస్తోంది. అంతకంతకూ ప్రమాదకరంగా మారుతోంది. 

ఈ టోర్నడో అస్సోంలోని బార్పేట జిల్లాలో ఇవాళ సంభవించింది. అయితే ఈ ప్రాంతంలో ఇది సాధారణమేనని కొందరంటున్నారు. కాలబైశాఖి సమయంలో ఇది తరచూ జరుగుతుందంటున్నారు. ఈ 
టోర్నడో వీడియోను వాతావరణ సంస్థ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాలబైశాఖి సమయంలో ఈ తరహా టోర్నడోలు సంభవించడం అరుదుగా జరిగేది కాకపోయినా..సాధారణం మాత్రం కాదని వాతావరణ సంస్థ అంచనా వేసింది.

టోర్నడోను వాతావరణ శాఖ  EF-0 లేదా EF-1 గా అంచనా వేసింది. స్థానికులు తీసిన ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. దుమ్ముధూళితో కూడిన టోర్నడో ప్రమాదకరంగా కనబడుతోంది. ఈ టోర్నోడోపై భారత వాతావరణ శాఖ వద్ద ఎటువంటి వివరాలు, సమాచారం లేదు. 

Also readFunny Video: దొంగల్లో వీడో ఓ వెరైటీ..పెళ్లిలో దొంగగా మారిన ఫోటోగ్రాఫర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News