Prashanth reddy: తెలంగాణలో పాలిటిక్స్ హీట్ మీద ఉన్నాయి. రాహుల్ టూర్‌పై టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరంగల్ సభ వేదికగా గులాబీ తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎండగట్టారు. బంగారు తెలంగాణ అంటూ అవినీతి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు.
తెలంగాణలో రాహుల్ టూర్ రాజకీయ వేడి పుట్టిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోణలు చేసుకుంటున్నాయి. వరంగల్ సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మాటలు చూస్తుంటే జాలేస్తోందన్నారు. పట్టపగలు డబ్బు సంచులతో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆ స్క్రిప్ట్‌తో తన అజ్ఞానాన్ని రాహుల్ బయట పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పాలన అద్భుతంగా ఉందని స్పష్టం చేశారు.
వరంగల్ డిక్లరేషన్ దేనికోసమని ఫైర్ అయ్యారు. ఈ ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి.హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించడకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రజలు, అమరవీరుల త్యాగాలను అవమానించినట్లేనన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోయినా..తాము తీసుకుంటున్నామన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా రుణమాఫీ చేస్తున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నా..తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని రాహుల్, కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీపై పోరాడుతోందని టీఆర్ఎస్ పార్టీనేనని తేల్చి చెప్పారు.
మొత్తంగా రాహుల్(RAHUL) పర్యటన ..పొలిటికల్ వార్‌కు తెరతీసింది. ఈ మంటలు చల్లరాడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలన గురించి తెలంగాణ ప్రజలకు తెలుసని అంటున్నారు.
Also read:Ap Govt Loan:జీతాలకు డబ్బులొస్తున్నాయ్.. ఏపీ సర్కార్ మరో 3 వేల కోట్ల రుణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook