Sarkaru Vaari Paata Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకు మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు రూ.45 మేర పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం (మే 6) రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆచార్య, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
సర్కారు వారి పాట మేకర్స్ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల విడుదల చేసిన 'సర్కారు వారి పాట' సినిమాలో సీఎం జగన్ డైలాగ్ వినిపించిన సంగతి తెలిసిందే. మహేష్ పలికిన 'నేను విన్నాను నేను ఉన్నాను' అనే డైలాగ్ గతంలో పాదయాత్ర సమయంలో జగన్ నోట చాలాసార్లు వినిపించింది. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాపులర్ డైలాగ్.
వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాతో ఈ డైలాగ్ మరింత పాపులర్ అయింది. ఎప్పుడైతే ఈ డైలాగ్ మహేష్ నోట వినిపించిందో... ఇక ఈ సినిమాకు ఏపీలో టికెట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇట్టే అనుమతులు ఇచ్చేస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేశారు. గతంలో పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపుకు అనుమతినిచ్చినట్లుగానే తాజాగా ఈ సినిమాకు కూడా ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చింది.
సర్కారు వారి పాట సినిమా విషయానికొస్తే... మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ (మే 7) హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: IPL 2022 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు వేళాయే.. నాకౌట్ బరిలో నిలిచే టీమ్స్ ఇవేనా?
Als Read: Mothers Day 2022 : రేపు మదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి