David Warner played Most Innovative Shot in cricket history: ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వార్నర్.. ఆ తర్వాత గేర్ మార్చాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఎస్ఆర్హెచ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను వార్నర్ ఓ ఆటాడుకున్నాడు. మొత్తానికి వార్నర్ దంచికొట్టడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది.
బ్రబౌర్న్ స్టేడియంలోని నలుమూలకు బంతిని బాదిన డేవిడ్ వార్నర్.. మైదానంలోని ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచులో వార్నర్ సరికొత్త షాట్ ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి గతంలో ఎవరూ ఆడని షాట్ ఆడాడు. వార్నర్ తన స్టాన్స్‌ని రైట్ హ్యాండర్‌గా (స్విచ్ హిట్) మార్చడంను భువీ గమనించి వైడ్ యార్కర్ (రైట్ హ్యాండర్‌కు వేసే బంతి) రూపంలో బంతిని సంధించాడు. అయితే ఆ బంతికి స్విచ్ హిట్ షాట్ ఆడలేనని తెలుసుకున్న వార్నర్.. ఓ రైట్ హ్యాండర్ థర్డ్ మ్యాన్ దిశగా ఎలా షాట్ ఆడతాడో అలా ఆడేశాడు. ఇంకేముందు బంతి బౌండరీకి వెళ్లింది.
మొత్తానికి లెఫ్ట్ హ్యాండర్ అయిన డేవిడ్ వార్నర్.. రైట్ హ్యాండర్ ఎలా షాట్ ఆడతాడో అలా ఆడాడు. దీన్నే ఇన్నోవేటివ్ షాట్ అంటారు. ఈ షాట్‌కు వ్యాఖ్యాతలతో సహా గ్రౌండ్‌లోని ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. భువనేశ్వర్ కుమార్ అయితే కాసేపు బిత్తరపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చుసిన అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. అమేజింగ్ షాట్ అని ఒకరు ట్వీట్ చేయగా.. ఇన్నోవేటివ్ షాట్ అని ఇంకొకరు ట్వీటారు. ఈ షాట్ పేరేంటో చెప్పండి అని ఇంకొందరు అడుగుతున్నారు.
This amazing shot by @davidwarner31!! What do you call it?
A reverse glide?
Let’s have your take, @KP24/@wvraman? pic.twitter.com/32pbYu9CN4
— Joy Chakravarty (@TheJoyofGolf) May 5, 2022
ఇక ఈ మ్యాచులో డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక అర్థ సెంచరీలు (89) బాదిన తొలి బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (88) రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (77), ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ (70), టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (69) వరుసగా టాప్ 5లో ఉన్నారు.
Also Read: David Warner Record: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు!
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్... పెరిగిన బంగారం ధరలు... ఏ నగరాల్లో ఎంతంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.