Why Nails Should not cut at Night: హిందూ మతం, వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయరాదని శాస్త్రం నిషేధించింది. అంతే కాకుండా కొన్ని పనులు నిర్దిష్ట సమయంలో మాత్రమే చేయాలని సూచించింది. నియమాలను పాటించకపోతే అశుభ ఫలితాలు వస్తాయని శాస్త్రాన్ని నమ్మె వారు చెబుతున్నారు. అలాంటి పనులలో రాత్రిపూట గోళ్లు కత్తిరించడం ఒకటి. అయితే రాత్రిపూట గోళ్లు కత్తిరించడంపై ఇంటి పెద్దలు, మహిళలు తరచుగా చెప్తుంటారు. రాత్రి పూట గోళ్లు కత్తిరించొదని అంటారు. రాత్రిపూట గోళ్లు కత్తిరించడం వల్ల పేదరికం వస్తుందని నమ్ముతారు.
రాత్రిపూట గోళ్లు కత్తిరించకపోవడం ఎందుకు మంచిది కాదు:
రాత్రిపూట గోళ్లు కత్తిరించడం వెనుక శాస్త్రీయ కారణం ఏమిటంటే... ఇంతకు ముందు కరెంటు లేని కాలంలో రాత్రిపూట గోళ్లు కత్తిరించడం నిషేధించారు. చీకట్లో గోళ్లు కత్తిరించే సమయంలో వెళ్లకు ఎలాంటి గాయం కాకుండా ఉండడం కోసమే రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని శాస్త్రం చెబుతోంది.
ఆర్థికంగా ఎందుకు నష్టపోతారు..?:
మరోవైపు మతం, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం..సిరి సంపదలకు ప్రతి రూపమైన లక్ష్మి రాత్రిపూట గోళ్లు కత్తిరించడం వల్ల చికాకుపడుతుందని శాస్త్రం తెలిపింది. దీంతో ఇంట్లో పేదరికం వస్తుందని వ్యక్తి ఆర్థికంగా నష్టపోతాడని, అప్పుల భారం పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది. నిజానికి శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి సాయంత్రం వేళలో వస్తుందని పరిశుభ్రతకు సంబంధించిన పనులన్నీ అంతకు ముందే పూర్తి చేయాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇంటి బయట శుభ్రతైనా వ్యక్తిగత శుభ్రతైనా సాయంత్రానికి ముందే చేయాలని శాస్త్రం చూచించింది.
సాయంత్రం ఈ పని చేయండి:
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే సూర్యాస్తమయానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం పూజ చేసి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. దేవతలకు ఆరతి కూడా అందించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలను కలిగుతాయని శాస్త్రం చెబుతోంది.
Also Read: AP 10th Papers Leak: పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వెనుక కారణాలివేనా, నిజమెంత
Also Read: SVP Trailer Record: రికార్డులు బద్దలు కొట్టిన 'సర్కారు వారి పాట' ట్రైలర్.. అర్ధ గంటలోనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook