Corona Fourth Wave: తెలంగాణలో కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరిక, పెరుగుతున్న కేసులు

Corona Fourth Wave: దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. జూన్ నాటికి కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనని తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కన్పించనుందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2022, 03:14 PM IST
  • దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
  • తెలంగాణలో జూన్ నాటికి కేసులు రోజుకు 3 వేలు దాటుతాయంటున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
  • కాన్పూర్ ఐఐటీ కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ప్రజల్లో భయాందోళనలు
Corona Fourth Wave: తెలంగాణలో కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరిక, పెరుగుతున్న కేసులు

Corona Fourth Wave: దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. జూన్ నాటికి కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనని తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కన్పించనుందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. 

కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశంలో జూన్ చివరి వారంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమై..సెప్టెంబర్ వరకూ ఉండవచ్చని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు హెచ్చరించి ఉన్నారు. ప్రస్తుతం ఆ హెచ్చరికే ఆందోళన కల్గిస్తోంది. దీనికి కారణం దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటమే. దేశంలో గత 24 గంటల్లో  3వేల 5 వందల వరకూ కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బహిరంగప్రదేశాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి చేశాయి. ఉల్లంఘిస్తే 5 వందల రూపాయల జరిమానా విధించారు. మరోవైపు కరోనా నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.

ఇటు ఇదే భయం ఇప్పుడు తెలంగాణలో వెంటాడుతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో రోజుకు 40 కొత్త కేసులే నమోదవుతున్నాయి. కానీ జూన్ నాటికి రోజుకు 2 వేల 5 వందల నుంచి 3 వేల వరకూ ఉండవచ్చని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ దశే కరోనా ఫోర్త్‌వేవ్ అని అధికారులు తెలిపారు. అయితే కరోనా ఫోర్త్‌వేవ్‌లో వైరస్ తీవ్రత తక్కువే ఉంటుందంటున్నారు వైద్యులు. వారం రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాస్క్ తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు.

Also read: Google Hyderabad Campus: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్.. కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News