Tata Motors New Ev Launch : లాంఛ్‌కు రెడీ అయిన టాటా మోటార్స్ సరికొత్త ఈవీ

Tata Motors New Ev Launch: టాటా మోటార్స్ నుంచి మరో ఈవీ రాబోతోంది. ఇది ఎలా ఉండబోతుందన్న దానిపై వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 06:23 PM IST
  • టాటా మోటార్స్ నుంచి మరో ఈవీ
    కొత్త ఈవీపై ఉత్కంఠ
    ఇప్పటికే మార్కెట్ ఈవీ లీడర్‌గా టాటా
Tata Motors New Ev Launch : లాంఛ్‌కు రెడీ అయిన టాటా మోటార్స్ సరికొత్త ఈవీ

Tata Motors New Ev Launch: ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రంగంలో దూసుకుపోతున్న టాటా మోటార్స్ మరో ఈవీని లాంఛ్ చేయడానికి రెడీ అయ్యింది. ఈవీ సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్ గా ఉన్న టాటా మోటార్స్ తన స్థానం మరింత పదిలం చేసుకోవడానికి సిద్ధమైంది. శుక్రవారం సరికొత్త ఈవీ వెహికిల్ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

పెట్రోల్ డీజిల్ రేట్లు మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ కార్లకు జనంలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఆ మార్కెట్ లో సత్తా చూపడానికి అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఈవీ మార్కెట్ లో తొంభైశాతం వాటా టాటా మోటార్స్‌కే ఉంది. నెక్సాన్‌తో పాటు టిగోర్ లో ఈవీ వెర్షన్స్ సంస్థ ఇప్పటికే మార్కెట్‌లోకి తెచ్చింది. ఇందులో నెక్సాన్ ఈవీ విపరీతంగా సేల్ అవుతోంది. టిగోర్ ఈవీకి కూడా మంచిసేల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఈవీ కారును మార్కెట్ లోకి తేవడానికి రెడీ అవుతోంది టాటా మోటార్స్. కొత్తగా వచ్చే కారు ఆల్ట్రోజ్ ఈవీ లేదా నెక్సాన్ ఈవీకి అప్‌డేటెడ్ వర్షన్ అయ్యిఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి. 

టాటా మోటార్స్ వచ్చే ఐదేళ్లలో 10 ఎలక్ట్రిక్ వెహికిల్స్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటివరకు రెండు ఈవీ కార్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడొచ్చే వెహికిల్ ఈ పరంపరలో మూడవది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈవీ కార్ల కోసం టాటా మోటార్స్ రీసెర్చ్ చేస్తోంది. సింగిల్ ఛార్జ్ తో 450 కిలోమీటర్ల రేంజ్ ఉండే వాహనాలను ప్రవేశపెడతామని ఇప్పటికే హామీ ఇచ్చింది. దీనికి తగ్గట్లే 40 kwh బ్యాటరీల కోసం సంస్థ పరిశోధనలు చేస్తోంది.

శుక్రవారం లాంఛ్ చేసే ఈవీ... టిగోర్, నెక్సాన్ కు మద్యస్థంగా ఉండొచ్చని అంచనాలు వస్తున్నాయి. ఈ వెహికిల్ లో సింగిల్ ఛార్జ్ తో 300 కి.మీ వరకు  ప్రయాణించొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉండే అవకాశముంది. ఏదేమైనా కొత్త ఈవీపై ఇప్పటివరకు టాటా మోటార్స్ ఎలాంటి సమాచారం బయటపడనీయలేదు. దీంతో ఇది ఎలా ఉంటుందా అని అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

Also read : Anasuya Bharadwaj: బ్లూ కలర్ గౌనులో హోయలు పోతున్న హాట్ బేబీ అనసూయ... 

Also read :  Kinder Chocolate: కిండర్ జాయ్ చాక్లెట్‌ తిన్న 151 మంది చిన్నారులకు అస్వస్థత..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News