ATM Attack By JCB Machine Video: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే... మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
డబ్బు దోచుకునే విషయంలో దొంగలు ఎంతకైనా తెగిస్తారు. మహారాష్ట్రలోని (Maharashtra) సాంగ్లీలో జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. సాధాణంగా జేసీబీలను ఏ చెరువు తవ్వడానికో లేదో ఇళ్లు కూల్చడానికో ఉపయోగిస్తాం. కానీ జేసీబీతో కూడా దొంగతనం చేయవచ్చని నిరూపించారు కొందరు దుండగలు. ఏకంగా ఏటీఎం మిషన్ నే జేసీబీతో లాక్కెళ్లిపోయారు (ATM robbery with JCB). ఈ వీడియో ఏటీఎం సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
While in other states JCB bulldozers are used to remove illegal enroachments of rioters.
In Maharashtra's Sangli, JCB bulldozer was used to loot a ATM machine in
Such is the fearlessness of goons. pic.twitter.com/XSmBbv7Qnr
— #DextrousNinja🇮🇳 (@DextrousNinja) April 24, 2022
ఏటీఎంలో ఉన్న నగదు ₹ 27 లక్షలను దొంగలు దోచుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు నిరుద్యోగాన్ని నిందించారు. "క్రిప్టో మైనింగ్ యుగంలో, ఇక్కడ ఒక కొత్త ఆవిష్కరణ atm మైనింగ్" అని ఒకరు, ''మనీ హీస్ట్ 2023?" అని మరొకరు కామెంట్ చేశారు.
Also Read: Viral Video: ఏమన్నా చేశాడా మ్యాజిక్?.. నిమ్మకాయలతో ఏం చేశాడో మీరే చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook