Number Plate: నువ్వు తోపు సామీ.. రూ. 71 వేల బండికి 15 లక్షల ఫ్యాన్సీ నంబర్‌! ట్విస్ట్ ఏంటంటే..

Honda Activa owner put Rs 15 lakhs for 0001 number plate. చండీగఢ్‌ రవాణా అధికారులు 0001 అనే సూపర్ వీఐపీ ఫ్యాన్సీ నంబరును రూ. 5 లక్షలకు వేలానికి ఉంచగా.. హోండా యాక్టివా యజమాని బ్రిజ్‌ మోహన్‌ రూ. 15.44 లక్షలకు దక్కించుకున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 02:17 PM IST
  • రూ. 71 వేల బండికి 15 లక్షల ఫ్యాన్సీ నంబర్‌
  • ఏ ఆడీ కారుకో, బీఎండబ్ల్యూ కారుకో కాదు
  • నువ్వు తోపు సామీ
Number Plate: నువ్వు తోపు సామీ.. రూ. 71 వేల బండికి 15 లక్షల ఫ్యాన్సీ నంబర్‌! ట్విస్ట్ ఏంటంటే..

Honda Activa owner put Rs 15 lakhs for 0001 number plate: నంబర్ ప్లేట్‌ 'ఫ్యాన్సీ నంబర్‌' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో ఫ్యాన్సీ నంబర్‌ కోసం ఎందరో ఎగబడుతుంటారు. హాట్ ఫ్యాన్సీ నంబర్‌ కోసం అయితే పోటీ ఎక్కువగానే ఉంటుంది. బాగా డబ్బున్న వారు, ప్రముఖులు తమ ఖరీదైన కార్లు, బైకులకు ఫ్యాన్సీ నంబర్‌ ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే భారీగా డబ్బు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకుంటారు. అయితే ఓ యాక్టివా యజమాని 15 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయింది.

విషయంలోకి వెళితే.. ఫ్యాన్సీ నంబర్లను అమ్మకానికి ఉంచడం ద్వారా భారీ ఆదాయం సమకూర్చుకోవాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే హరియాణా రాష్ట్ర చండీగఢ్‌ రిజిస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ ఇటీవల ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలం నిర్వహించింది. రవాణా అధికారులు 0001 అనే సూపర్ వీఐపీ ఫ్యాన్సీ నంబరును రూ. 5 లక్షలకు వేలానికి ఉంచారు. దీనికోసం ఎంతో మంది పోటీ పడ్డారు. చివరకు ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని బ్రిజ్‌ మోహన్‌ రూ. 15.44 లక్షలకు దక్కించుకున్నాడు.

 ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏ బెంజ్ కారుకో, ఏ ఆడీ కారుకో, బీఎండబ్ల్యూ కారుకో బ్రిజ్‌ మోహన్‌ రూ. 15.44 లక్షల ఫ్యాన్సీ నంబర్ కొనుగోలు చేయలేదు. రూ. 71 వేల తన హోండా యాక్టివా కోసం ఇంత మొత్తం వెచ్చించాడు. బ్రిజ్ మోహన్ ఈ నంబర్ ప్లేట్‌ను తన భవిష్యత్ వాహనం కోసం కొనుగోలు చేసాడట. 2022 దీపావళి సందర్భంగా ఓ కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నాడట. ముందుగా ఈ నంబర్ ప్లేట్ హోండా యాక్టివాకు పెట్టి.. కారు కొన్నాక మైగ్రేట్ చేసుకుంటాడట.

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విషయం తెలుసుకున్న నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు తోపు సామీ' అని ఒకరు కామెంట్ చేయగా.. 'దండాలయ్యా. నువ్ ఉండాలయ్యా' అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. చండీగఢ్ రిజిస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ 378 ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లను వేలంలో పెట్టి రూ. 1.5 కోట్లు వెనకేసుకుందట. ఇప్పటి వరకు 0001 నంబర్ ప్లేట్‌ను 179 రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు ఉపయోగిస్తున్నాయట. 

Also Read: Nazriya Nazim: నజ్రియా నజీమ్‌ కోసం చాలామంది ట్రై చేశారు.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: AVAK Trailer: మేం తెలంగాణోల్లం.. మాకు మర్యాదొక్కటి సరిపోదు! మటన్ ముక్క కూడా గావాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News