Viral Video, Royal Bengal Tiger jumps from boat into the water: నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఓ వీడియో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. వాటిలో ఎక్కువగా పాములు, జంతువులకు సంబందించినవి ఉంటాయి. ముఖ్యంగా పులులకు సంబందించిన వీడియోలే ప్రతిరోజు ట్రెండ్ అవుతాయి. పులులు చేసే రకరకాల విన్యాసాల వీడియోలు తెగ వైరల్ అవుతాయి. అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటుంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఓ పులి బోట్ నుంచి నీటిలోకి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయింది.
పశ్చిమ బెంగాల్‌లోని అటవీ ప్రాంతం నుంచి ఓ రాయల్ బెంగాల్ టైగర్ జనవాసంలోకి వచ్చింది. జనాలు భయాందోళనకు గురవుతుండడంతో.. ఆ పులిని అటవీ శాఖ అధికారులు బంధించారు. ఆ తర్వాత సుందర్ బన్స్ అటవీ ప్రాంతంలో పులిని విడిచిపెట్టేందుకు దాన్ని బోటులోకి ఎక్కించారు. ఒడ్డుకు కొంచెం సమీపంలో పడవను ఆపేసి.. బోను నుంచి పులిని వదిలారు. ఆ పులి వెంటనే నీటిలోకి దూకింది. వెనక్కి కూడా తిరిగి చూడకుండా.. అటవీ ప్రాంతం వైపు ఈదుకుంటూ వెళ్లింది. చివరకు ఒడ్డుకు చేరి అడవిలోకి వెళ్లింది.
That tiger sized jump though. Old video of rescue & release of tiger from Sundarbans. pic.twitter.com/u6ls2NW7H3
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 17, 2022
ఇందుకు సంబందించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్‌ఎస్) పర్వీన్ కల్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతోఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియను ఇప్పటికే 88 వేల మంది చూశారు. అంతేకాదు నాలుగు వేల మంది లైక్ చేశారు. వీడియో చుసిన నెటిజన్లు కామెంట్లు చేశారు. 'లైఫ్ ఆఫ్ పై' సినిమాను గుర్తుకు తెచ్చిందని ఒకరు ట్వీట్ చేయగా.. 'బెంగాల్ టైగర్ బాగా ఈదుతుందే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
Also Read: Cancel IPL: ఐపీఎల్ 2022ని క్యాన్సిల్ చేయండి.. డిమాండ్ చేస్తున్న ఆ రెండు జట్ల ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Viral Video: బోట్ నుంచి నీటిలోకి దూకిన పులి.. 'లైఫ్ ఆఫ్ పై'ను గుర్తుకు తెచ్చిన ఘటన
బోట్ నుంచి నీటిలోకి దూకిన పులి
వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఈదుకుంటూ వెళ్లిన పులి
'లైఫ్ ఆఫ్ పై'ను గుర్తుకు తెచ్చింది