Umran Malik: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. మరెవరూ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నాడు.
శ్రీనగర్‌కు చెందిన సూపర్ ఫాస్ట్ బౌలర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సత్తా చాటుతున్నాడు. అత్యంత వేగవంతమైన బాల్స్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెడుతున్నాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు వివరాలిలా ఉన్నాయి.
ఆదివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు కేవలం 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీ20 మ్యాచ్‌లలో చివరి ఓవర్‌లో సాధారణంగా ఎక్కువ పరుగులు వెళ్తుంటాయి. అటువంటిది ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. ఇప్పటివరకూ ఎవరూ సాధించని..మరెవరూ సాధించలేని రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అంటే 20వ ఓవర్ మెయిడెన్ చేయడమే కాకుండా..మూడు వికెట్లు పడగొట్టాడు. మరో రనవుట్ చేశాడు. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి 28 పరుగులిచ్చాడు. ఒక ఓవర్ మెయిడెన్ చేశాడు.
గతంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ మెయిడెన్ చేసిన వారు ముగ్గురున్నారు. కానీ వికెట్లు తీయలేదు. ఆ ముగ్గురిలో ఇర్ఫాన్ పఠాన్ 2008లో ముంబై ఇండియన్స్‌పై మెయిడెన్ ఓవర్ వేయగా, 2009లో డెక్కన్ ఛార్జర్స్‌పై లసిత్ మలింగ, 2017లో ఎస్‌ఆర్‌హెచ్‌పై జైదేవ్ ఉనాద్కట్ ఈ ఫీట్ సాధించారు. అయితే మెయిడెన్ ఓవర్‌తో పాటు 3 వికెట్లు తీసిన ఘనత మాత్రం ఉమ్రాన్ మాలిక్‌దే.
పేస్‌తో బ్యాటర్లతో పోరాడటమే తన విధి అని ఉమ్రాన్ మాలిక్ అంటున్నాడు. అత్యంత వేగవంతమైన బాల్స్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెడుతున్న ఉమ్రాన్ మాలిక్ వాస్తవానికి లెదర్ బాల్‌తో ఆడటం మొదలెట్టింది 2018 నుంచే. అప్పటి వరకూ టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. కశ్మీర్‌కు చెందిన మరో సహచర ఆటగాడు అబ్దుల్ సమద్ కారణంగా తాను సన్‌రైజర్స్ జట్టులో రాగలిగానంటున్నాడు. నెట్ బౌలర్‌గా ప్రాక్టీసు చేస్తూ టీమ్‌లో కీలక ఆటగాడిగా మారిపోయాడు.
Also read: Rashid Khan: మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన రషీద్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook