Kareena Kapoor joins Ranbir Kapoor and Alia Bhatt wedding celebrations: ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. రణ్‌బీర్, ఆలియా గురువారం (ఏప్రిల్ 14) పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ సంబంధించిన సెలబ్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రణ్‌బీర్ కపూర్ నివాసంలో ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొకరుగా పెళ్లి వేడుకలకు హజరవుతున్నారు.
ఆలియా-రణ్‌బీర్ పెళ్లి వేడుకలు ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలోని రణ్‌బీర్ కపూర్ నివాసంలో ఘనంగా జరుతున్నాయి. ఉదయాన్నే గణపతి పూజను రణ్‌బీర్ అపార్ట్మెంట్లో నిర్వహించారు. ఈ వేడుకల్లో రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్, సోదరి, బంధువులు పాల్గొన్నారు. మధ్యహ్నం జరిగిన మెహందీ వేడుకలకు బాలీవుడ్ సినీ తారలు హాజరయ్యారు. రణబీర్ కపూర్ సోదరిమనులు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఈ మెహందీ పంక్షన్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కరీనా తెలుపు లెహంగాలో సందడి చేశారు. ఈ వేడుకలకు కరణ్ జోహార్, మహేష్ భట్, పూజా భట్, రాహుల్ భట్ కూడా హాజరయ్యారు.
Sisters Kareena Kapoor, Karisma Kapoor make a stylish entry at Ranbir-Alia's pre-wedding ceremonies
Read @ANI Story | https://t.co/9yCE1SJl9R#KareenaKapoor #KarismaKapoor #AliaBhatt #RanbirKapoor #AliaRanbirwedding #RanAlia #Ralia #AliaBhattRanbirKapoorwedding pic.twitter.com/F3z8sYOxc4
— ANI Digital (@ani_digital) April 13, 2022
రణబీర్ కపూర్ నివాసంలో ఇప్పటికే మెహందీ వేడుకలు ముగియగా.. పెళ్లి సందడి మొదలయింది. ఆలియా-రణ్‌బీర్ పెళ్లి సందర్భంగా ముంబైలోని ఆర్కే స్టూడియో, వాస్తు అపార్ట్మెంట్, కపూర్ కుటుంబానికి చెందిన కృష్ణరాజ్ బంగ్లా.. విద్యుదీపాల కాంతులతో కలకలలాడుతుంది. ఆలియా-రణ్‌బీర్ పెళ్లి సందర్భంగా బాలీవుడ్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ ఇద్దరి పెళ్లి గత వారం రోజులుగా పెద్ద హాట్ అయిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు పెళ్లి వాయిదా అంటూ వార్తలు రాగా.. నేడు హల్దీ వేడుకలు కూడా ముగియడం విశేషం.
Also Read: Summer Fruits: మండు వేసవిలో ఈ పండ్లను తీసుకుంటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ranbir-Alia wedding: నేడే రణ్‌బీర్, ఆలియా ఎంగేజ్మెంట్.. ముఖ్య అతిథిగా స్టార్ హీరోయిన్!
నేడే రణ్‌బీర్-ఆలియా ఎంగేజ్మెంట్
ముఖ్య అతిథిగా స్టార్ హీరోయిన్
అలియా-రణ్‌బీర్ కొత్త పెళ్లి డేట్ ఇదే