Budi Mutyala Naidu Political Profile: పాత కేబినెట్‌లో మాదిరే కొత్త కేబినెట్‌లోనూ ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించారు సీఎం జగన్. ఇందులో అంజాద్ భాషా, నారాయణస్వామిలకు మరోసారి డిప్యూటీ సీఎంలుగా అవకాశం దక్కగా.. కొత్తగా బూడి ముత్యాల నాయుడు, పీడిక రాజన్న దొర, కొట్టు సత్యనారాయణలకు అవకాశం కల్పించారు. సోమవారం (ఏప్రిల్ 11) రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. కొత్తగా డిప్యూటీ సీఎంలుగా అవకాశం దక్కించుకున్నవారిలో బూడి ముత్యాల నాయుడు రాజకీయ ప్రస్థానంపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఉప సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బూడి ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడాన్ని పలువురు కొనియాడుతున్నారు. బూడి ముత్యాల నాయుడు 1988లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం జిల్లాలోని తారువ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు చేపట్టారు.
ఎప్పటికైనా ఎమ్మెల్యే అవాలనేది బూడి ముత్యాల నాయుడు చిరకాల కోరిక. దేవరాపల్లిలో కాలేజీలో చదువుకునే రోజుల్లో... ఆయన ఉండే గది గోడపై ఎమ్మెల్యే అనే పదాన్ని రాసుకున్నారు. రోజూ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గోడపై రాసుకున్న ఆ ఎమ్మెల్యే అనే పదాన్నే చూసేవారు. 2014లో వైసీపీ టికెట్‌పై మాడుగుల నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కల అలా నెరవేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ముత్యాల నాయుడు విజయం సాధించారు.
బీసీ సామాజికవర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడికి కొత్త కేబినెట్‌లో సీఎం జగన్ గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖలను అప్పగించారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని... తనకు ఇష్టమైన శాఖలను అప్పగించడం సంతోషంగా ఉందని ముత్యాల నాయుడు పేర్కొన్నారు.
Also Read: Flipkart Smart TV Offers: రూ.20 వేల విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.899లకే అందుబాటులో!
Broccoli: బ్రకోలీ జ్యూస్... రోగాలను తన్ని తరిమేసే ఔషధం... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Budi Mutyala Naidu: ఒకప్పుడు ఉప సర్పంచ్.. ఇప్పుడు డిప్యూటీ సీఎం..
కొత్త కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బూడి ముత్యాల నాయుడు
ఒకప్పుడు ఉప సర్పంచ్‌గా చేసిన ముత్యాల నాయుడు
ఉప సర్పంచ్ నుంచి నేడు డిప్యూటీ సీఎం వరకు