IMD Twitter Hack: భారత వాతావరణ శాఖ ట్విట్టర్ అకౌంట్ శనివారం (ఏప్రిల్ 9) రాత్రి హ్యాక్‌కి గురైంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. హ్యాక్‌కి గురైన ఐఎండీ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హ్యాక్‌కి పాల్పడింది ఎవరనేది ఇప్పటికైతే వెల్లడికాలేదు.
హ్యాక్ తర్వాత ఐఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ పిక్‌ని కూడా హ్యాకర్స్ తొలగించారు. ఆపై ఆ హ్యాండిల్ నుంచి పలు ట్వీట్స్ పోస్ట్ అయ్యాయి. ఇందులో ఒక ట్వీట్‌లో 'బీన్జ్ అధికారిక కలెక్షన్ వెల్లడి వేడుకలో భాగంగా కమ్యూనిటీలోని యాక్టివ్ ఎన్‌ఎఫ్‌టీ ట్రేడర్స్ అందరికీ ఎయిర్‌డ్రాప్ ఓపెన్ చేశాం.' అని పేర్కొన్నారు.
ఐఎండీ ట్విట్టర్ ఖాతా మాత్రమే కాదు, అంతకుముందు ఉత్తరప్రదేశ్ సీఎంవో ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్‌కి గురైంది. హ్యాకర్స్ సీఎంవో ప్రొఫైల్ స్థానంలో కార్టూనిస్ట్ మంకీ పిక్చర్‌ను పోస్ట్ చేశారు. సీఎంవో ఖాతా సుమారు 29 నిమిషాల పాటు హ్యాక్‌కి గురైంది. హ్యాకింగ్ తర్వాత దాదాపు నాలుగైదు వంద ట్వీట్స్ ఆ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయ్యాయి. దీనిపై యూపీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Pushpa Villain in Karimnagar: కరీంనగర్‌లో పుష్ప విలన్... ఇమిటేషన్ కాదు... ఏడేళ్లుగా ఇదే గెటప్...
Also Read: Viral News: ఈ దొంగల ముఠా చేసిన పనికి ఇరిగేషన్ అధికారుల దిమ్మతిరిగింది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook