ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అక్కడి కౌంటీల్లో ఆడి సన్నద్ధం కావాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే..! అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కొహ్లీని కౌంటీలలో అనుమతించడాన్ని ఇంగ్లాండ్ మాజీ ప్రేసర్ బాబ్ విల్లీస్ తప్పుబట్టారు. కొహ్లీని కౌంటీలలో ఆడేందుకు అనుమతిస్తే ఇంగ్లండ్ సొంతగడ్డపై ఓటమికి సిద్దమైనట్లేనని అభిప్రాయపడ్డారు.
కొహ్లీ మళ్లీ విఫలం కావాలంటే ఇంగ్లాండ్ బోర్డు అతడికి ఛాన్స్ ఇవ్వకూడదని సూచించాడు. ఇంగ్లండ్‌కు చెందిన యువ ఆటగాళ్లకు కౌంటీల్లో పెద్ద సంఖ్యలో అవకాశాలు ఇస్తేనే తమ టెస్టు జట్టు బాగుపడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున విల్లీస్ 90 టెస్టులు ఆడి 325 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్‌కు ముందు శిఖర్ ధావన్ తన కుటుంబంతో గడిపేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడని సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఓ ప్రకటనలో తెలిపింది.
'కొహ్లీని కౌంటీల్లో అనుమతించవద్దు'