అడవుల్లో నివశించే గిరిజన తెగలను ఆదివాసీలు అంటాము. ఒక్కో తెగకు ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఆలాంటి తెగలలో ఒకటి తమిళనాడు రాష్ట్రం నీలగిరి కొండల్లో ఉంది. ఆ తెగ పేరు టోడ. ఈ తెగలో మొదట పెళ్లి చేసి శోభనం జరిపిస్తారు.. ఆతరువాత గర్బం ధరిస్తేనే వివాహం జరిగినట్టు లేకపోతే పెళ్లి జరగనట్టు. వినటానికి భళే వింతగా ఉన్నా ఇది నిజం.
వివరాలలోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి అడవుల్లో టోడ అనే గిరిజన తెగ చాలా ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. బాహ్య ప్రపంచముతో సంబంధము లేకుండా జీవనం సాగిస్తుంటారు. వారి ఆచార- వ్యవహారాలను మార్చుకోవడానికి ఇష్టపడరు. ఈ తెగలో పెళ్లి వేడుకలు సాధారణంగా నిర్వహిస్తారు. కొన్ని రోజులు వధువు వరుడితో గడుపుతుంది. అనంతరం వధువు తల్లితండ్రుల వద్దకు వెళుతుంది. ఆ సమయంలో వధువు ఖచ్చితంగా నెల తప్పాల్సిందే.. లేకపోతే పెళ్లి రద్దైతుంది. నెల తప్పితే భర్త ఏడో నెల అడవులకు వెళ్లి బాణం, విల్లు భార్యకు ఇస్తాడు. భార్య ఆ వస్తువులను స్వీకరిస్తే భర్తగా అంగీకరించినట్లు, కడుపులోని బిడ్డకు తండ్రి అని ఒప్పుకుంటుంది.
ఈ ఘట్టం ముగిశాక బాణం, విల్లు వేడుకలు నిర్వహిస్తారు. ఆటపాటలతో, సంప్రదాయ నృత్యాలతో చిందులేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఇరువురి పెద్దలు ఆ భార్యాభర్తలిద్దరినీ కలకాలం సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తారు.
ఆదివాసీల వింత ఆచారం