PBKS vs GT Dream11 Match 16 Prediction: ఐపీఎల్ 2022లో ఈరోజు మరో రసవత్తర పోరు జరగనుంది. టోర్నీలో మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. బ్రబౌర్న్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్ మరో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. మ్యాచ్ నేపథ్యంలో ప్లేయింగ్ ఎలెవన్ ఓసారి చూద్దాం.
ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో పంజాబ్ కింగ్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఓపెనర్ అయిన బెయిర్‌స్టో.. ఈరోజు గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ ఆడనున్నాడు. అతడు జట్టులోకి వస్తాడు కాబట్టి భానుక రాజపక్సపై వేటు పడనుంది. శిఖర్ ధావన్‌తో కలిసి బెయిర్‌స్టో ఓపెనింగ్ చేయనున్నాడు. ఇద్దరు ఫామ్ అందుకుంటే పరుగుల వరద పారాల్సిందే. లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్, షారుఖ్‌ఖాన్, ఓడియన్ స్మిత్‌తో బ్యాటింగ్ బలంగా ఉంది. కగిసో రబడ, వైభవ్ అరోరా, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు కూడా ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ కూడా పటిష్టంగానే ఉంది. శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ మంచి ఓపెనింగ్ ఇస్తే.. ఆపై డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా ఒత్తిడి లేకుండా బ్యాట్ జులిపించగలరు. గుజరాత్ జట్టు బ్యాటింగ్ కంటే బౌలింగ్ బాగుంది. లూకీ ఫెర్గూసన్, మొహ్మద్ షమీ, రషీద్ ఖాన్, వరుణ్ ఆరోన్ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ముఖ్యంగా ఫెర్గూసన్, షమీ, రషీద్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలరు.
తుది జట్లు (అంచనా):
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారూక్ ఖాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), కగిసో రబాడ, ఓడెన్ స్మిత్, వైభవ్ అరోరా, రాహుల్ చహర్, అర్షదీప్ సింగ్.
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వెడ్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, అభినవ్ మనోహర్, వరుణ్ అరోన్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ.
డ్రీమ్ 11 టీమ్ ఇదే:
జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభినవ్ మనోహర్, లియామ్ లివింగ్‌స్టోన్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, కగిసో రబాడ, లాకీ ఫెర్గూసన్ (వైస్ కెప్టెన్).
Also Read: Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం
Also Read: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ ఫుల్‌గా తాగి.. 15వ అంతస్థు నుంచి నన్ను తోసేయబోయాడు: చహల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook