Rohit Sharma: మరో 54 పరుగులే.. రోహిత్‌ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు! రెండో క్రికెటర్‌గా..

Rohit Sharma needs 54 Runs to complete 10000 runs. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ కోల్‌కతాతో మ్యాచ్‌లో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకుంటాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2022, 06:14 PM IST
  • రోహిత్‌ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు
  • రెండో క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డు
  • అగ్ర స్థానంలో క్రిస్ గేల్
Rohit Sharma: మరో 54 పరుగులే.. రోహిత్‌ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు! రెండో క్రికెటర్‌గా..

Rohit Sharma needs 54 Runs to complete 10000 runs In T20 Cricket: ఐపీఎల్ 2022లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌, రెండుసార్లు టైటిల్ కైవసం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలదపడనున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు విజయ రుచిని చూడని ముంబై త‌న‌కు అచ్చొచ్చిన కోల్‌క‌తాపై గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. పుణే వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో ముంబై సారథి రోహిత్ మరో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకుంటాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసిన తొలి భారత ఆటగాడిగా అగ్రస్థానం ఉన్నాడు. రోహిత్ మరో 54 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండు భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. 

మొత్తంగా చూసుకుంటే.. టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో వెస్టిండీస్ వెటరన్ ప్లేయర్ క్రిస్ గేల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. యూనివర్సల్ బాస్ ఇప్పటివరకు 463 మ్యాచ్‌లు ఆడి..14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ రెండో స్థానంలో ఉన్నాడు. మాలిక్ 472 మ్యాచ్‌లు ఆడి.. 11698 పరుగులు సాధించాడు. మూడో స్థానంలో విండీస్ పరిమిత ఓవర్ల సారథి కీరన్ పొలార్డ్ ఉన్నాడు. పోలీ 582 మ్యాచుల్లో 11,452 పరుగులు చేశాడు. 

టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫించ్ 347 మ్యాచుల్లో 10,444 పరుగులు బాదాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 328 మ్యాచులలో 10,326 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 318 మ్యాచులలో 10,308 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 372 మ్యాచుల్లో 9946 రన్స్ చేశాడు. 

Also Read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 అరుదైన రికార్డు.. మొదటి కన్నడ సినిమాగా..!

Also Read: Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే.. నేను చేసుకుంటా! హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News