Huge Drug Sales in the mirror of the Dark Net: కాలానికి అనుకునంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఈ టెక్నాలజీని కొందరు మంచికి ఉపయోగిస్తే.. మరికొందరు మాత్రం చెడుకు వాడుతున్నారు. ముఖ్యంగా మత్తు పదార్థల అమ్మకాల ప్రక్రియలో ఎవరికీ తెలియని టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అదో పెద్ద మాఫియా లోకంగా మారింది డార్క్‌వెబ్. అధికారులకు ఈ డార్క్‌వెబ్‌తో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. క్రయవిక్రయాలు జరిపిన డాటాను సేకరించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
మత్తు పదార్థమైన ఎల్ఎస్డీ బ్లాట్స్ డార్క్ నెట్ నుంచి కొనుగోలు చేసి.. నగరంలో విక్రయిస్తున్న షాబాజ్నగర్, కూకట్‌పల్లిలకు చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్‌లను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు గత నెల 24న పట్టుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను అధికారులు ఫిబ్రవరి 26న బట్టబయలు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్‌నెట్ నుంచి బ్లాట్స్ను విక్రయించాడు. ఈ డార్క్‌నెట్ నుంచి పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కొనుగోలు చేశారని అధికారుల తెలిపారు.
అధికారులకు డార్క్‌నెట్ లేదా డార్క్‌వెబ్‌తో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతే కాకుండా నిందితులను పట్టుకున్న తరువాత వారు క్రయవిక్రయాలు జరిపిన డాటాను సేకరించడం పెద్ద సవాలుగా మారింది. డార్క్‌నెట్‌లో మత్తు పదార్థాలు కాకుండా క్రైమ్‌కు సంబంధించి వస్తువులైన తుపాకులు, కత్తులు తదితర వస్తువులు విక్రయాలు చేయవచ్చు. కనిపించే ప్రపంచంలో మాఫియా డాన్లు రాజ్యమేలితే.. ఇంటర్నెట్లోని డార్క్నెట్గా పిలిచే వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అక్రమ దందాలకు డార్క్ వెబ్ ఓ స్పాట్‌గా మారింది.
అందరు వాడే కంప్యూటర్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టం, పలు చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. అయితే ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ దిగ్గజాలు వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చి, ప్రతి చిన్న వస్తువు నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఈ ఈ–కామర్స్ వెబ్సైట్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి నిఘాకు చిక్కకుండా తమ వినియోగదారులకు మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మత్తు పదార్థల ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో నేడు చాలా రకాల మత్తు పదార్థలు, ఆయుధాలను క్రయవిక్రయాలు చేస్తున్నారు. దీన్ని సాంకేతిక భాషాలో డీప్ వెబ్, అండర్‌గ్రౌండ్ వెబ్, డార్క్ వెబ్ అని పిలుస్తారు.
Also Read: Ugadi 2022: ఉగాది పర్వదినాన.. ముస్లిం భక్తులలో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం! ఎక్కడో తెలుసా?
Also Read: Anushka Sharma: అనుష్క శర్మ.. టూ హాట్! ఆసక్తికర కామెంట్ చేసిన విరాట్ కోహ్లీ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.